YSR Matsyakara Bharosa: వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో రూ. 109 కోట్లు జమ చేసిన ఏపీ సర్కారు
AP CM YS Jagan (Photo-Twitter)

Amaravati, May 13; ఏపీ సీఎం వైఎస్‌ జగన్ కోనసీమ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఐ పోలవరం మండలం మురమళ్ల‌లో నాలుగో ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా (YSR Matsyakara Bharosa) కార్యక్రమాన్ని ఆయ‌న‌ ప్రారంభించి, అనంత‌రం మురమళ్ల‌ వేదికపై ప్ర‌సంగించారు. భ‌గ‌వంతుడి దయతో మరో మంచి కార్యక్రమాన్ని(AP CM Launched YSR Matsyakara Bharosa) ప్రారంభిస్తున్నామ‌ని, దాదాపు 1,09,000 మందికి మంచి జరిగే కార్యక్రమాన్ని ముమ్మడివరంలో చేయబోతున్నామ‌ని చెప్పారు.

ఇందులో భాగంగా నాలుగో ఏడాది కూడా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఇస్తున్నామ‌ని తెలిపారు. ఈ ఏడాది 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో 109 కోట్ల రూపాయ‌లు జమ చేస్తున్నామ‌ని చెప్పారు. మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు మొత్తం క‌లిపి 418 కోట్ల రూపాయ‌ల‌ సాయం చేశామ‌ని వివ‌రించారు.దీంతో పాటు ఓఎన్జీసీ పైపులైన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో రూ.108 కోట్లు జమ చేశారు. (గతంలో 14,824 బాధిత మత్స్యకార కుటుంబాలకు రూ.70.04 కోట్ల పరిహారం అందించారు) వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద గంగపుత్రులకు నాలుగేళ్లలో రూ.418.08 కోట్లు లబ్ధి కలిగింది. టీడీపీ ఐదేళ్ల హయాంలో ఈ సాయం కేవలం రూ.104.62 కోట్లు మాత్రమే.

మే 22 నుంచి సీఎం జగన్ దావోస్ పర్యటన, వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న సీఎం జగన్ టీం, ఏపీ ప్రత్యేకతను ప్రపంచ స్థాయిలో చాటేలా ప్రయత్నం

సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్నిక‌ల ముందు చేసిన పాద‌యాత్ర‌లో మత్స్యకారుల స‌మ‌స్య‌ల గురించి తెలుసుకున్నాన‌ని జ‌గ‌న్ చెప్పారు. గ‌త సీఎం చంద్రబాబు నాయుడి పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని, అప్ప‌టి పాల‌న‌కు, త‌మ‌ ప్రభుత్వ పాలనకు మ‌ధ్య‌ తేడాలు గమనించాల‌ని జ‌గ‌న్ కోరారు. అప్ప‌ట్లో కొంతమందికి మాత్రమే పరిహారం అందేదని, ఇప్పుడు ల‌బ్ధిదారులంద‌రికీ అందుతోంద‌ని చెప్పారు.

గత ప్రభుత్వ కాలంలో మొద‌ట‌ 12 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించారని, ఎన్నికలు దగ్గర పడే సమయానికి మాత్రం 50 వేల మందికి పరిహారం ఇచ్చారని జ‌గ‌న్ ఆరోపించారు. గ‌త ప్ర‌భుత్వం ఐదేళ్లలో ఇచ్చింది రూ.104 కోట్లు మాత్ర‌మేన‌ని అన్నారు. కాగా, అంత‌కుముందు మత్స్య శాఖమంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. మత్స్యకారుల‌ జీవితాల్లో వైఎస్‌ జగన్‌ వెలుగులు నింపుతున్నారని, ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారులకు భరోసా అందిస్తున్నారని చెప్పారు. తమిళనాడులో రూ.5 వేలు, ఒడిశాలో రూ.4 వేలు మాత్ర‌మే ఇస్తున్నారని, తీర ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే అధికంగా పరిహారం అందిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

వేట కోల్పోయిన 23,548 మంది మత్స్యకారులకు ఓఎన్‌జీసీ చెల్లించిన రూ.108 కోట్ల నష్టపరిహారాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నాం. జీవనోపాధి కోల్పోయిన 69 గ్రామాల మత్స్యకారు కుటుంబాలకు రూ.11,500 చొప్పున 4 నెలలపాటు ఓఎన్‌జీసీ చెల్లించిన రూ.108 కోట్ల నష్టపరిహారాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నామని సీఎం అన్నారు. మత్స్యకారుల కష్టాలను పాదయాత్రలో దగ్గరగా చూశా. చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదు. గత ప్రభుత్వ పాలనకు.. మన ప్రభుత్వ పాలనకు తేడా గమనించండి. గతంలో కొంతమందికి మాత్రమే పరిహారం అందేది. ఇవాళ అర్హులందరికీ మత్స్యకార భరోసా అందిస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. గత ప్రభుత్వ కాలంలో 12 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించారు. ఎన్నికలు దగ్గర పడే సమయానికి 50వేల మందికి పరిహారం ఇచ్చారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది రూ.104 కోట్లు. ఇవాళ మన ప్రభుత్వంలో ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్నాం. మనం ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్‌, ఖురాన్‌, గీతగా భావించామన్నారు.

మన ప్రభుత్వం వచ్చాక డీజిల్‌పై సబ్సిడీ రూ.6 నుంచి రూ.9కి పెంచాం. స్మార్ట్‌ కార్డులు జారీ చేసి డీజిల్‌ కొనేటప్పుడే సబ్సిడీ సొమ్ము మినహాయింపునిస్తున్నాం. వేటకు వెళ్లి మత్స్యకారుడు ప్రమాదవశాత్తు చనిపోతే వచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాం. మత్స్యకారులకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. కొత్తగా 9 ఫిషింగ్‌ హార్బర్లు, 4 ఫిషింగ్‌ ల్యాండింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామని సీఎం జగన్‌ అన్నారు.

మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. చంద్రబాబు ఇంత మంచి పని చేశాడని చెప్పే ధైర్యం దత్తపుత్రుడికి లేదు. దత్తపుత్రుడితో పాటు ఎల్లోమీడియాకు కూడా ధైర్యం లేదు. 2019లో మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను అమలు చేశాం. నిజాయితీ, నిబద్ధతో ప్రజల ముందుకు వస్తున్నాం. దుష్టచతుష్టయం అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు. నలుగురికి తోడు వీరి దత్తపుత్రుడు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని వీరు జీర్ణించుకోలేరు. పరీక్షల పేపర్లు వీళ్లే లీక్‌ చేస్తారు. పేపర్‌ లీక్‌ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా?. ఈఎస్‌ఐలో డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీళ్లేదనే ప్రతిపక్షం, ఎల్లోమీడియాను ఎక్కడైనా చూశారా అని సీఎం జగన్‌ అన్నారు. కొడుక్కి పచ్చి అబద్ధాలు, మోసాలతో ట్రైనింగ్‌ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని ఎక్కడైనా చూశారా?. కోర్టుకు వెళ్లి మంచి పనులు అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా?. ప్రజలకు మంచి జరిగితే ఇలాంటి రాబందులకు అసలు నచ్చదు.