YS Vivekananda Reddy (Photo-ANI)

Pulivendula, Sep 27: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగా, కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో (YS Viveka Murder Case) కీలక అనుమానితుడిగా భావిస్తున్న మున్నా నార్కో పరీక్షలకు అంగీకరించాడు. మేజిస్ట్రేట్ ఎదుట తన సమ్మతి తెలిపాడు. దాంతో పులివెందుల కోర్టు (Pulivendula court ) అతడికి నార్కో పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ అధికారులకు అనుమతి ఇచ్చింది.

నార్కో పరీక్షలు (CBI officials to conduct narco test ) నిర్వహించేందుకు గాను మున్నాను సీబీఐ అధికారులు త్వరలో గుజరాత్ కు తీసుకెళ్లనున్నారు. వివేకా హత్య కేసు తర్వాత పులివెందులలోని ఓ బ్యాంకులో మున్నాకు చెందిన లాకర్ లో రూ.40 లక్షలకు పైగా నగదు గుర్తించారు. కాగా మున్నా (accused Munna) పులివెందులలో ఓ చెప్పుల షాపు యజమాని. అయితే, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరితో మున్నా సంబంధాల నేపథ్యంలో సీబీఐ అతడిపైనా విచారణ చేపట్టింది.

వివేకా హత్య కేసులో సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం వివేకా ఇంట్లో సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేసిన సీబీఐ అధికారులు.. ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ఎలా ఇంట్లోకి ప్రవేశించారు, ఎక్కడెక్కడ దాక్కున్నారు, గేటు తీసుకొని ఎలా వెళ్లారు, బైక్‌పై ఎవరెవరు వచ్చారు, హత్య జరిగిన తర్వాత ఎలా ఎస్కేప్ అయ్యారు వివరాలను పరిశీలించారు. హత్య ఎలా జరిగిందో కల్పిత పాత్రలతో సీబీఐ అధికారులు వీడియో షూట్ చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో ఇంట్లో ఉన్న వివేకా కుమార్తె సునీతతో అధికారులు గంట పాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసులో నిందితుల పాత్రపై చర్చినట్లు తెలుస్తోంది.

వివేకా హత్య కేసులో మరొకరు అరెస్ట్, పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డి సోదరుడు ఉమా శంకర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ, 14 రోజులపాటు రిమాండ్‌ విధించిన కోర్టు

2019 మార్చి 14న ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఇంటికి చేరుకున్న వివేకా.. మార్చి 15 తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యారు. వివేకా ఇంటికి వచ్చినపుడు కారులో ఆయనతోపాటు ఎర్ర గంగిరెడ్డి మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత గంగిరెడ్డిని ఆయన ఇంటి వద్ద దిగబెట్టి… వివేకా తన ఇంటికి వచ్చారు. అర్ధరాత్రి దాటాక తర్వాత నలుగురు వ్యక్తులు వివేకా ఇంట్లోకి చొరబడి ఉంటారని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.

వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ప్రకటన, కేసుకు సంబంధించి నమ్మదగిన సమాచారం అందిస్తే రూ.5లక్షలు రివార్డు, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపిన సీబీఐ అధికారులు

వారిలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర కూడా ఉన్నారని సీబీఐ ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. హత్య జరిగిన రోజు ఇంట్లో సాక్ష్యాధారాలు చెరిపేశారనే అభియోగాలపై 2019 మార్చి 28నే సిట్‌ అధికారులు గంగిరెడ్డిని అరెస్టు చేశారు. అప్పట్లో 90 రోజుల పాటు జైల్లో ఉన్న గంగిరెడ్డి ఆ తర్వాత బెయిల్‌పై బయటికొచ్చారు. ఇప్పుడు 302 సెక్షన్‌ కింద మరోసారి అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.