Amaravati,Dec 2: ఏపీలో అమూల్ ప్రాజెక్టు కార్యకలాపాలను ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో పాటు వైఎస్సార్ చేయూత (YSR Cheyutha), ఆసరా (YSR Asara) మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan) ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పశువుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అమూల్‌తో (Amul project) ఒప్పందం ద్వారా పాడిరైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. పాదయాత్రలో పాడి రైతుల కష్టాలను చూశానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక సహకార సొసైటీలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చామని గుర్తుచేశారు. మార్కెట్‌లో పోటీతత్వం వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. అమూల్‌తో ఒప్పందం వల్ల పాడిరైతులకు లీటర్‌కు రూ.5 నుంచి రూ.7 వరకు ఆదాయం చేకూరుతుందని పేర్కొన్నారు.
Distribution of livestock units to women through YSR Asara
వైయస్ఆర్ చేయూత, ఆసరా మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ, అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ #YSRCheyutha #YSRAsara #Amul https://t.co/rdQ9SyJlTK
— YSR Congress Party (@YSRCParty) December 2, 2020
అమూల్‌కు వచ్చే లాభాల్లో ఏడాదికి రెండుసార్లు బోనస్ రూపంలో మహిళలకే ఇస్తుందని సీఎం వైఎస్ జగన్ వివరించారు. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాలను విక్రయించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నగదును పంపిణీ చేస్తారు. ఎన్నికల సమయంలో పశుపోషకులకు ఇచ్చిన హామీని అమలు పరచడంలో భాగంగా పాలసేకరణ, మార్కెటింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన అమూల్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే.
ఈ నెల 5వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు లక్ష యూనిట్లు, అలాగే వచ్చే ఏడాది ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరిల మధ్య 3.68 లక్షల పాడిపశువుల యూనిట్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Here's AP CMO Tweet
ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) ఎండీ ఆర్.ఎస్.సోధి, కైరా మిల్క్ యూనియన్ (అమూల్ డెయిరీ) ఎండీ అమిత్ వ్యాస్, సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీఎం పటేల్. pic.twitter.com/OfNhS9XJra
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 1, 2020
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) ఎండీ ఆర్.ఎస్.సోధి మంగళవారం కలిశారు. సీఎం జగన్ నివాసంలో ఈ భేటీ జరిగింది. సోధితోపాటు కైరా మిల్క్ యూనియన్(అమూల్ డెయిరీ) ఎండీ అమిత్ వ్యాస్, సబర్‌కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీఎం పటేల్ ఉన్నారు.