Amaravati, August 25: వైఎస్సార్ నేతన్న నేస్తం (YSR Netanna Nestham) నాలుగో విడుత పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పెడనలో పర్యటిస్తున్నారు. పెడన వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించిన సీఎం జగన్.. స్థానిక నేతలతో ఆప్యాయ పలకరింపు. అక్కడ ఏర్పాటు చేసిన హస్తకళాకారుల ప్రదర్శనలను వీక్షించారు.చేనేత కళాకారుల ప్రదర్శన వీక్షించిన సీఎం జగన్ (CM YS Jagan Mohan Reddy) స్వయంగా మగ్గాన్ని నేశారు. అనంతరం వేదక మీదకు చేరుకుని 80,546 మంది నేతన్నల ఖాతాల్లోకి రూ. 193.31 కోట్లు జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు సాయం ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమల్లోకి తెచ్చామని, వారికి నేనున్నాననే భరోసా అందించామని అన్నారు. నేతన్నల జీవితాలను నా పాదయాత్రలో గమనించా. గతంలో ఏ ప్రభుత్వం చేనేతకు అండగా నిలవలేదు. దేశ స్వాతంత్ర్య సమరాన్ని ఒక మగ్గం మార్చేసిందని సీఎం అన్నారు.