Vijayawada, JAN 24: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai reddy) రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ మారింది. రాజకీయాలకు గుడ్ బై చెబుతూ ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేసింది. వైసీపీ అధినేత జగన్ కు (YS Jagan) అత్యంత సన్నిహితుల్లో ఒకరు విజయసాయిరెడ్డి. అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సెన్సేషనల్ గా మారింది. ఇదిలా ఉంటే.. విజయసాయిరెడ్డి బాటలో మరికొందరు వైసీపీ నేతలు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో మరికొందరు వైసీపీ కీలక నాయకులు ఆ పార్టీని వీడనున్నారని, రాజకీయాల నుంచి తప్పుకుంటారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) గురించి ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. ఈ నెల 25న కొడాలి నాని వైసీపీకి రాజీనామా చేస్తారని.. ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
దీనిపై స్వయంగా కొడాలి నాని స్పందించారు. అది ఫేక్ అని ఆయన క్లారిటీ ఇచ్చారు. తన గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్న ప్రచారంలోనూ వాస్తవం లేదన్నారు. అది ఫేక్ పోస్ట్ అని ఆయన తేల్చి చెప్పారు. అది ఎడిటెడ్ న్యూస్ అని, ఫేక్ అని, దాన్ని ఎవరూ నమ్మొద్దని స్వయంగా సోషల్ మీడియాలో స్పందించారు కొడాలి నాని.