YSRCP Jayaho BC Mahasabha 2022 (Photo-Twitter/YSRCP)

VJY, Dec 7: వైఎస్సార్‌సీపీ బీసీ మహాసభకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో జరిగింది. వెనుకబడిన వర్గాలే వెన్నెముక’ నినాదంతో బుధవారం నిర్వహిస్తున్న మహాస­భకు (Jayaho BC Mahasabha) భారీగా జనం తరలివచ్చారు. జయహో బీసీ మహాసభలో (YSRCP Jayaho BC Mahasabha 2022) ఆర్‌ కృష్ణయ్య మాట్లాడారు. ఏపీలో సీఎం జగన్‌.. పదకొండు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టిన ఘనత జగన్‌దే. బీసీ బిల్లు వస్తే.. మన(బీసీలను ఉద్దేశించి..) తల రాతలు మారిపోతాయి.

ఎన్నో ఉద్యమాలు చేశా.. బీసీ కేంద్రమంత్రుల్ని కలిశా. కానీ, ఎవరూ సీఎం జగన్‌లా కృషి చేయలేదు. ధైర్యం చేసి ఆయన బీసీల పక్షాన నిలిచారు. బీసీలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు. సీఎం జగన్‌ ఓ సంఘ సంస్కర్త. ఒక బీసీలకే కాదు.. అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని చూస్తున్నారు.మాయమాటలకు, మభ్య పెట్టే మాటలకు బీసీలు లొంగిపోకూడదని, చిత్తశుద్ధితో నిజంగా మన అభివృద్ధి కోరుతున్న నాయకుడికి(సీఎం జగన్‌) మద్ధతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆర్‌ కృష్ణయ్య.. ఈ సందర్భంగా బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.

Here's Jayaho BC Mahasabha 2022 Updates

బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని బీసీ ఉద్యమ నేత, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. ఏపీలో బీసీలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది సీఎం జగనే అని వైఎస్‌ఆర్‌సీపీ జయహో మహాసభలో ఆయన తెలిపారు.

ప్రధాని మోదీని కలిసిన సీఎం జగన్, జీ 20 సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

వార్డు మెంబర్‌ నుంచి రాజ్యసభ వరకు బీసీలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ఆశాజ్యోతి పూలే, అంబేద్కర్‌ భావజాలం ఆయనది. చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మింగేస్తారు అని ఎంపీ మార్గాని భరత్‌ పేర్కొన్నారు. బీసీల్లో పేదరికాన్ని తొలగించేందుకు సీఎం జగన్‌ కృషి చేస్తున్నారు. బీసీల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. చదవుకు పేదరికం అడ్డుకావొద్దని ఆయన భావించారని ఎంపీ మోపిదేవి వెంకట రమణ తెలిపారు.

విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే వేడుకలు, అబ్బురపరిచిన యుద్ధ నౌకలు, విమానాలు, చూపరులను కట్టిపడేసిన మిగ్‌-19 యుద్ధ విమానాలు విన్యాసాలు

తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా అని చంద్రబాబు బీసీలను బెదిరించారు. కానీ, బీసీలే రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్‌ భావించారు. బీసీలకు సీఎం జగన్‌ ఏం చేశారో ఈ సభను చూస్తే తెలుస్తుందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నెముక అనే భావజాలాన్ని తెచ్చింది కూడా సీఎం జగనే అని పార్థసారథి పేర్కొన్నారు. బీసీలే రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్‌ భావించారు. రాష్ట్రంలో బీసీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారు. గతంలో కాళ్లు అరిగేలా తిరిగినా సంక్షేమ పథకాలు వచ్చేవి కావు. కానీ, జగన్‌ పాలనలో ఇంటి గడపకే సంక్షేమ పథకాలు వస్తున్నాయి. బీసీ రిజర్వేషన్‌ బిల్లు పెట్టిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమే అని పార్థసారథి పేర్కొన్నారు.

జయహో బీసీ మహాసభలో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తామన్నారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ ఏకంగా లేఖ రాశాడు. కానీ, సీఎం జగన్‌ బీసీలకు గొప్ప ఆత్మగౌరవం ఇచ్చారు. బీసీలకు సమున్నత స్థానం కల్పించారు. చరిత్ర తెలియనివాళ్లు బీసీల తోకలు కత్తిరిస్తారా?బీసీలు జడ్జిలుగా పనికి రారా? ముసుగులు వేసుకుని మారువేషంలో వస్తున్నారు జాగ్రత్త.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బీసీలు బుద్ధి చెప్పాలి అని తమ్మినేని పిలుపు ఇచ్చారు. బీసీలకు పదవులిచ్చి ప్రొత్సహించింది సీఎం జగన్‌. ఎంపీపీ పదవుల్లో 67 శాతం పదవులు కల్పించారు. బీసీలకు 56 కార్పొరేషన్లు కేటాయించారు. బీసీలంతా ఆలోచించుకుని.. సీఎం జగన్‌ వెంట నడవాలని తమ్మినేని సీతారాం బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు స్పీకర్‌ తమ్మినేని.

కష్టం నా కులం అన్నాడు. మానవత్వం నా మతమన్నాడు. వ్యక్తిత్వం నా వర్గమన్నాడు. అదీ జగనంటే.. అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ పేర్కొన్నారు. ‘‘బీసీల పక్షపాతి సీఎం జగన్‌. రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన వ్యక్తి కూడా. 139 బీసీ కులాలను ఏకం చేసిన నేత. చంద్రబాబు నాయుడు కేవలం కుల వృత్తులకే బీసీలను పరిమితం చేయాలనుకున్నాడు. పదకొండు తరాల వెనుకబాటుకి కారణం అయ్యాడు. కానీ, సీఎం జగన్‌ అలా కాదు’’ అంటూ ప్రశంసలు గుప్పించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.

వైఎస్‌ఆర్‌సీపీ ‘జయహో బీసీ మహాసభ’ ప్రారంభోపన్యాసాన్ని చేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బీసీ స్థితిగతులను మార్చేసిన వ్యక్తి సీఎం జగన్‌. సంచార జాతులను గుర్తించిన ఏకైక సీఎం కూడా ఈయనే. సీఎం జగన్‌ తన పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కేబినెట్‌లో పదకొండు మంది బీసీలకు స్థానం కల్పించారు. రాజ్యసభ పదవుల్లో సగం బీసీలకే ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్‌’’ అని కొనియాడారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.

14 ఏళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు బలహీనవర్గాలను కట్టుబానిసలుగా వాడుకున్నారు. బీసీలకు ఏపీలో మాత్రమే న్యాయం జరిగింది. బీసీ మహాసభ చరిత్రలో నిలిచిపోతుందని జోగి రమేష్ అన్నారు. బీసీలంతా సీఎం వైఎస్‌ జగన్‌ వెంటే ఉన్నారని మంత్రి కారుమూరి తెలిపారు.