
Vijayawada, Feb 11: తెలుగు రాష్ట్రాలతో (Telugu States) పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే స్కాంలో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు, బాలాజీ గ్రూప్ అధినేత మాగుంట రాఘవను (Magunta Raghava) ఈడీ (ED) తాజాగా అరెస్ట్ చేసింది. అంతకుముందు ఆయనను ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించింది. అనంతరం రాఘవను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. నేటి మధ్యాహ్నం రాఘవను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హజరుపరిచి కస్టడీకి అనుమతి కోరనున్నారు.
'శాకుంతలం' కొత్త రిలీజ్ డేట్.. ఏప్రిల్ 14. ప్రకటించిన చిత్రబృందం