New Delhi, April 16: కోవిడ్ -19 కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలను హాట్‌స్పాట్‌లుగా వర్గీకరిస్తూ దేశవ్యాప్తంగా 170 జిల్లాల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 19 జిల్లాలు హాట్‌స్పాట్‌లుగా గుర్తించబడ్డాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 11 జిల్లాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క కరోనావైరస్ పాజిటివ్ కేసు కూడా నిర్ధారించబడని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహాయించి ఏపీలో మిగతా అన్ని జిల్లాలు హాట్‌స్పాట్ జిల్లాలుగానే ప్రకటించబడ్డాయి. ఇక తెలంగాణ నుంచి 8 జిల్లాలను హాట్‌స్పాట్ లుగా కేంద్రం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ -19 హాట్‌స్పాట్స్ గా ఉన్న జిల్లాలు- కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి మరియు అనంతపురం.
ఏపీలో కొత్తగా మరో 23 పాజిటివ్ కేసులు నిర్ధారించబడటంతో గురువారం ఉదయం నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 525కు చేరింది. జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను గమనిస్తే ఇలా ఉన్నాయి.
తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగా రెడ్డి, జోగులంబా గద్వాల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కరీంనగర్ మరియు నిర్మల్ జిల్లాలు
హైదరాబాద్, మరో 7 తెలంగాణ జిల్లాలు కోవిడ్ -19 '' హాట్‌స్పాట్స్ ''
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఐఎఎన్‌ఎస్) హైదరాబాద్‌తో సహా ఎనిమిది తెలానాగనా జిల్లాలను కోవిడ్ -19 కేసులు ఎక్కువగా వ్యాపించడంతో హాట్ స్పాట్‌లుగా వర్గీకరించగా, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 జిల్లాలు జాబితాలో ఉన్నాయి.
తెలంగాణలోని హాట్‌స్పాట్ జిల్లాలు హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగా రెడ్డి, జోగులంబా గడ్వాల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కరీంనగర్ మరియు నిర్మల్ హాట్‌స్పాట్ జిల్లాలుగా ఉన్నాయి. మరొకటి నల్గొండ జిల్లా సమూహాలతో కూడిన (క్లస్టర్) హాట్‌స్పాట్ జిల్లాగా పేర్కొన బడింది. ఈ విభాగంలో ఏపీ నుంచి ఒక్క జిల్లా కూడా లేదు.
తెలంగాణలో మరో 19 జిల్లాల నుంచి కూడా కేసులు నివేదించబడి నాన్- హాట్‌స్పాట్ లుగా గుర్తించబడిన జిల్లాల జాబితాలో సూర్యాపేట, ఆదిలాబాద్, మహాబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహాబూబాబాద్, రాజన్న సిరిసిల్ల మరియు సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి.
ఇక తెలంగాణలో గురువారం ఉదయం నాటికి కోవిడ్-19 కేసుల సంఖ్య 650కి చేరింది. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం మే 03 వరకు లాక్డౌన్ పొడగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇది వరకే రెండవ ఫేజ్ లాక్డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. పరిస్థితులను బట్టి ఏప్రిల్ 20 నుంచి కొన్ని రంగాలకు లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు ఉంటాయని కేంద్రం పేర్కొంది. అయితే ఆ సడలింపులు హాట్‌స్పాట్ జిల్లాలకు వర్తించబోవు. హాట్‌స్పాట్లలో మరింత కఠినమైన నియంత్రణ చర్యలు అమలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక సూచనలు చేసింది.
రాబోయే 14 రోజులలో ఏవైనా హాట్‌స్పాట్‌లలో ఎటువంటి పాజిటివ్ కేసు నివేదించబడకపోతే, ఆయా హాట్‌స్పాట్‌లలో సమర్థవంతమైన నియంత్రణ చేపట్టినట్లుగా కేంద్రం భావిస్తుంది. దాని ప్రకారం ఆ హాట్‌స్పాట్‌లను రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ గా పరిగణిస్తుంది. అదే క్రమంలో 28 రోజుల పాటు ఎటువంటి కేసు నివేదించకపోతే వాటిని గ్రీన్ జోన్లుగా పరిగణిస్తుంది. వీటి ఆధారంగానే మున్ముందు లాక్డౌన్ సడలింపులు ఉండనున్నాయి.