Credits: Twitter

Visakhapatnam, Jan 29: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ (Vatti Vasanth Kumar) కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. వట్టి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖపట్టణంలోని (Visakhapatnam) అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పూళ్ల ఆయన స్వగ్రామం.

కశ్మీర్ విషయాన్ని మర్చిపోండి. భారత్ తో స్నేహపూర్వకంగా ఉండండి.. పాకిస్తాన్ కు సౌదీ అరేబియా, యూఏఈ హితవు

ఉంగుటూరు నుంచి 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య,  కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల తర్వాతి నుంచి రాజకీయాలకు దూరమయ్యారు. వసంతకుమార్ భౌతికకాయాన్ని విశాఖ నుంచి స్వగ్రామం తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

హైదరాబాదులో 10 అడుగుల మేర కుంగిన రోడ్డు... వీడియో ఇదిగో!