Hyderabad, May 13: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఓటింగ్ జోరుగా సాగుతున్నది. ఇలాంటి సమయాల్లో దొంగ ఓట్లు (Fake Votes) వేయడం, ఒకరి ఓటును మరొకరు వేయడం ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాగే మీ ఓటును కూడా మరొకరు మీకు తెలియకుండా వేశారా? మీ ఓటు హక్కు పోయిందని ఆందోళన పడుతున్నారా? అయితే, భయపడొద్దు. మీలాంటి వారికోసమే కేంద్ర ఎన్నికల సంఘం సెక్షన్ 49(పి)ని 1961లో తీసుకువచ్చింది. టెండర్ ఓటు లేదా చాలెంజ్ ఓటు సాయంతో ఈ సమస్యకు పరిష్కరం దొరుకుతుంది. దీనికి ముందు ఏం చెయ్యాలంటే??
మీ ఓటు మరొకరు వేస్తే.. ఏం చెయ్యాలంటే??
- పోలింగ్ సమయంలో మీ ఓటును వేరే వారు వేశారని గుర్తిస్తే... ముందుగా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిని కలవండి.
- అసలు ఓటరు మీరే అని నిరూపించుకోవాలి. అందుకోసం ఓటరు గుర్తింపు కార్డు, ఇతర ఐడీ ప్రూఫ్ లు సమర్పించాలి.
- అప్పుడు ప్రిసైడింగ్ అధికారి ఫారం 17(బి) ఇస్తారు. అందులో మీ పేరు, ఇతర వివరాలు నింపి, సంతకం చేసి ఇవ్వాలి.
- ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారి టెండర్ బ్యాలెట్ పేపర్ ను మీకు ఇస్తాడు. అందులో ఉన్న అభ్యర్థుల జాబితా పరిశీలించి, నచ్చిన అభ్యర్థికి ఓటేసి, తిరిగి ఆ బ్యాలెట్ పేపర్ ను ప్రిసైడింగ్ అధికారికి ఇచ్చేయాలి. అలా మీ ఓటు లెక్కలోకి వస్తుంది.