Hyderabad, Aug 8: ప్రతిష్టాత్మక సంస్థ ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) లో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంటెక్ (M.Tech) మొదటి సంవత్సరం (First Year) చదువుతున్న మమైత నాయక్ మానసిక ఒత్తిడి (Mental Pressure) కారణంగా ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతనెలలో మరో విద్యార్థి కార్తిక్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో మమైత నాయక్ ఇలా బలవంతంగా జీవితాన్ని ముగించడం కలకలం రేపుతోంది.
IIT Hyderabad Student Commits Suicide | @BIGTV TELUGU#iitstudent #iithyderabad #suicide #campus #student #LatestNews #BreakingNews #NewsUpdate #bigtv pic.twitter.com/D6Ii437IWQ
— Big Tv Telugu (@bigtv_live) August 8, 2023
Jayaprakash Narayan: వైసీపీలో జయప్రకాశ్ నారాయణ చేరబోతున్నారా? లోక్ సత్తా స్పందన ఏమిటి?
నా చావుకు ఎవరూ కారణం కాదు
సంగారెడ్డి గ్రామీణ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మమైత నాయక్ సోమవారం తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల 26నే అతడు ఎంటెక్ ప్రథమ సంవత్సరంలో చేరాడు. ఆ రోజు సాయంత్రం ఇతర విద్యార్థులు జరిగిన దారుణాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. మానసిక ఒత్తిడికి గురవుతున్నా’’ అని రాసున్న లేక మమైత గదిలో పోలీసులకు లభించింది. కాగా ఏడాది వ్యవధిలో నలుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతున్నది.