Hyderabad, Feb 28: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLA Quota MLC) ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం ఏపీలో (AP) ఏడుగురు ఎమ్మెల్సీలు (MLC), తెలంగాణలో (Telangana) ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 14న నామినేషన్లు పరిశీలిస్తారు. మార్చి 23న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజున ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఏపీలో పెరిగిన విజయ పాల ధర.. లీటరుపై రెండు రూపాయలు పెంపు.. రేపటి నుంచే కొత్త ధరలు అమల్లోకి