NIA (Photo Credits: Twitter)

Hyderabad, September 18: తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఏ సోదాలు (NIA searches) నిర్వహిస్తోంది. నిజామాబాద్, నిర్మల్‌, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో దాడులు చేపట్టింది. నిజామాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో 23 బృందాలతో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించగా...  కర్నూలు, కడప జిల్లాల్లో మరో 23 బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో 2 బృందాలతో ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. ఇప్పటికే పీఎఫ్‌ఐ (PFI) జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా ఇమ్రాన్, అబ్దుల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

హవ్వా! ఆ యూనివర్శిటీ హాస్టల్లో 60 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్.. ఇదంతా ఓ బోయ్ ఫ్రెండ్ పనే.. వర్సిటీలో ఉద్రిక్తత!

వీరిపై పోలీసులు దేశ ద్రోహం కేసులు నమోదు చేశారు. కరాటే శిక్షణ, లీగల్‌ అవేర్‌నెస్‌ ముసుగులో పీఎఫ్‌ఐ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మతకలహాలు సృష్టించేందుకు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. భైంసా అల్లర్లతో సంబంధాలపైనా ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది.