Hyderabad, Dec 30: తెలంగాణ శాసనసభ సోమవారం (నేడు) (Telangana Assembly Session) ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఇటీవల తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) కు నివాళులర్పించనున్నది. ఈ మేరకు ప్రభుత్వం రెండు రోజుల క్రితమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంపై నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయనకు సమాచారం ఇచ్చారు. సమావేశాలకు రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, సమావేశాలకు కేసీఆర్ రావడం లేదని సమాచారం.
కేసీఆర్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్
ఇవాళ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నిన్న కేసీఆర్కు ఫోన్ చేసిన స్పీకర్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేసీఆర్కు సమాచారం ఇచ్చిన… https://t.co/iCt8EG1MNy pic.twitter.com/LFZCQznT5T
— BIG TV Breaking News (@bigtvtelugu) December 30, 2024
ఆర్ధిక మార్గదర్శి
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని తన మేథస్సుతో గట్టెక్కించడమే కాకుండా పదేండ్లు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఎన్నో చిరస్మరణీయ పథకాలను అమలు చేశారు. ఈ నెల 26న ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశాన్ని నవ్యపథంలో నిలిపిన సింగ్ కు తెలంగాణ ప్రజాప్రతినిధులు నివాళి అర్పించనున్నారు. సభ నేటి ఉదయం 10గంటలకు ప్రారంభం కానుండగా, సభ్యులంతా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవల్ని స్మరించుకోవడంతోపాటు నివాళులర్పించనున్నారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడనున్నది.
2025 తెలంగాణ ప్రభుత్వ సెలవులివే, అక్టోబర్ 3న దసరా..20న దీపావళి, పూర్తి వివరాలివే