Hyderabad, Jan 8: చైనాలో (China) వెలుగుచూసిన హెచ్‌ఎంపీవీ (HMPV) ఇప్పటికే దేశంలోకి ఎంటరైంది. ఇప్పటికే దేశంలో 7 కేసులు నమోదయ్యాయి. అయితే, గతనెలలోనే ఈ వైరస్ తెలంగాణలోకి ప్రవేశించినట్టు తాజాగా తెలిసింది. గత నెలలో పలువురు వైరల్‌ ఇన్‌ ఫెక్షన్లతో బాధపడుతుండటంతో హైదరాబాద్‌లోని మణి మైక్రోబయాలజికల్‌ ల్యాబోరేటరీ 258 మందికి శ్వాస కోశ వైద్య పరీక్షలు నిర్వహించింది. వాటిలో 205 మందికి ఎగువ శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వీటిలో 11 శాంపిల్స్‌ లో హెచ్‌ఎంపీవీ పాజిటివ్ అని తేలిందని మణి మైక్రో బయాలజీ ల్యాబోరేటరీ పేర్కొంది.

డియర్ ఆనంద్.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌... చిరుత‌కే చుక్క‌లు చూపించిన తెగువ ఎంతోమందిని కాపాడింది బాస్... వైర‌ల్ వీడియో!

అందరూ డిశ్చార్జ్

వైరస్ పాజిటివ్ గా తేలిన వాళ్ళందరూ ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. ‘హెచ్‌ఎంపీవీ వైరస్‌ కొత్తదేం కాదు.. ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ కాలంగా హెచ్‌ఎంపీవీ వైరస్‌ భారత్‌ లో ఉందని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ప్రకటించింది.

విశాఖలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన.. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే (వీడియో)