COVID19 Outbreak in Telangana. | Photo: Twitter

Hyderabad, August 9: తెలంగాణలో రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం గత 24 గంటల్లో 22,928 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1982 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1509 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,13,231 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 79,495కి చేరుకుంది.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో కంటే ఇప్పుడు కరోనా తీవ్రత కొంత తగ్గింది అయితే గ్రేటర్ వెలుపల మాత్రం వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతూ పోతుంది. జిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుపోతుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 463 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  మేడ్చల్ నుంచి 141 , రంగారెడ్డి జిల్లా నుంచి 139, మరియు సంగారెడ్డి జిల్లాల నుంచి 49 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.

ఇక పలు జిల్లాల్లో కొవిడ్ తీవ్రత కొనసాగుతోంది.  కరీంనగర్ జిల్లా నుంచి 96 పాజిటివ్ కేసులు నమోదు కాగా,  గద్వాల్ నుంచి 93, జనగాం నుంచి 78, వరంగల్ అర్బన్ నుంచి 71 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇక గత కొంత కాలంగా నిర్మల్ జిల్లా నుంచి 0 లేదా 1 కేసు మాత్రమే నివేదిస్తూ వస్తుండగా రెండు, మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరిగింది. నిర్మల్ జిల్లా నుంచి గత ఒక్కరోజులో 47 పాజిటివ్ కేసులు నివేదించబడ్డాయి.

Telangana's COVID Report:

Status of positive cases of #COVID19 in Telangana

ఆగష్టు 8న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 12 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 627 కు పెరిగింది.

అలాగే, శనివారం సాయంత్రం వరకు మరో 1669 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 55,999 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,869 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ప్రజాప్రతినిధులకు కరోనా గండం

తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు కరోనా గండం వెంటాడుతోంది. ఇప్పటికే చాలా మంది నాయకులు కరోనా బారిన పడగా, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎంపీ నంది ఎల్లయ్యలు మరణించారు. అయితే ఎక్కువ మంది మాత్రం ఈ వైరస్ బారిన పడినా కోలుకుంటున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, రోహిత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు పాజిటివ్ అని తేలింది. అయితే ఆరోగ్యంగానే ఉన్నాం, కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేస్తామని నాయకులు చెబుతున్నారు.