మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం యంనంపేటలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల వద్ద మరోసారి ఫైటింగ్ వాతావరణం నెలకొంది. కొందరు యువకులు సోమవారం మధ్యాహ్నం తరువాత కళాశాలలోకి దూసుకెళ్లి కనిపించిన ప్రతి ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. అధ్యాపకులు, సిబ్బందితో పాటు అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
పోచారం ఐటీ కారిడార్ సీఐ వి.అశోక్‌రెడ్డి సిబ్బందితో వెళ్లి దాడికి దిగిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఓ విద్యార్థి సమస్యపై కళాశాల హెచ్‌వోడీతో మాట్లాడేందుకు ఏబీవీపీ ప్రతినిధులు సచిన్‌నాయక్, ఆదిత్య గతనెల 31న కళాశాలకు వెళ్లారు. గేటువద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వీరిని లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది వారిపై దాడి చేసి గాయపరిచారు.
సోమవారం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ జరిగింది. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే కొందరు యువకులు ఇనుప రాడ్లు, కర్రలతో ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. సెక్యూరిటీ గార్డులు వీరాస్వామితో పాటు ఇతర సిబ్బందిని, సత్యనారాయణ అనే ఉద్యోగిని కొట్టారు. కళాశాల ప్రతినిధి నరసింహారెడ్డిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.
Here's Videos
శ్రీనిధి కాలేజ్ మీద దారుణంగా దాడి చేసి సిబ్బందిని చితకబాదిన ఏబీవీపీ కార్యకర్తలు
కొంతమంది విద్యార్థులను అకారణంగా డిటైన్ చేశారని శ్రీనిధి కళాశాల అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేసి, సెక్యూరిటీ సిబ్బందిని చితకబాదారు. 15 మంది ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. pic.twitter.com/R5pUYk7EvO
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2023
దాడికి పాల్పడిన వారు ఏబీవీపీ జెండాలు తీయడం, మెడలో కండువాలు వేసుకోవడంతో వారు ఏబీవీపీ ప్రతినిధులని తెలిసింది. ఘటనపై శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ టీసీహెచ్ శివారెడ్డి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిలో 15 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.