One killed as violence rocks Secunderabad railway station (Photo-Twitter)

Hyd, June 22: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పెనువిధ్వంసమే సృష్టించిన (Agnipath Protest) సంగతి విదితమే. అయితే ఈ విధ్వంసం కేసులో.. అల్లర్ల నిందితులకు (Secunderabad Railway Station Agitators) బుధవారం  రిమాండ్ విధించింది రైల్వే కోర్టు.‘సాయి అకాడమీ’ సుబ్బారావు సహా 15 మందిని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. సుబ్బారావు పాత్రపై కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. ఇక పృథ్వీరాజ్‌ అనే అదిలాబాద్‌ వాసి.. విధ్వంసంలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అలాగే పరారైన 25 మంది నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో (Secunderabad Railway Station) దాడులు జరిగిన తరువాత పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్‌ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ ఆందోళనల్లో పాల్గొన్న వరంగల్‌ యువకుడు గోవింద్‌ అజయ్‌ ఆత్మహత్యాయత్నప్రయత్ని చేశాడు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అజయ్‌.. ఆందోళనల్లో పాల్గొని ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడాడు. దీంతో, అజయ్‌ గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారన్న విషయం తెలుసుకున్నాడు.

సికింద్రాబాద్ అల్లర్ల ప్రధాన సూత్రధారి అరెస్ట్, వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే మెసేజ్‌లు పెట్టినట్లు గుర్తింపు, రహస్య ప్రాంతంలో దర్యాప్తు, నర్సరావుపేటలో డిఫెన్స్ అకాడమీ నడుపుతున్న అనుమానితుడు

ఈ క్రమంలో తనపై కేసులు పెడతారేమోనని భయపడిన అజయ్‌.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన అజయ్‌ పేరెంట్స్‌.. అతడిని వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అజయ్‌.. వాట్సాప్‌ మెసేజ్‌ రావడం వల్లే తాను అక్కడికి వెళ్లానని చెప్పాడు. తాను వెళ్లిన 10 నిమిషాలకు అక్కడ ఫైరింగ్‌ జరిగినట్టు తెలిపాడు. ఆర్మీ ఫిజికల్ టెస్టులో పాస్ అయి రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. ఆర్మీకి ప్రిపేర్ కావడంతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా అప్లై చేశానన్నాడు. ఆందోళనల్లో భాగంగా కేసు అయితే ఉద్యోగం రాదనే భయంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు చెప్పుకొచ్చాడు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway station) విధ్వంసం కేసులో మరికొన్ని వీడియోలు(Videos) వెలుగులోకి వచ్చాయి. ఆస్తులు, బోగీలకు పృధ్విరాజ్ అనే యువకుడు నిప్పు పెట్టాడు. ప్యాసింజర్ బోగీలోకి వెళ్లి పృద్వీరాజ్ నిప్పు పెట్టినట్టు వీడియో ద్వారా స్పష్టమవుతోంది. విధ్వంసం అనంతరం వాటి వీడియోలను అతను వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేశాడు. పృథ్విని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

అసలేం జరిగింది..సికింద్రాబాద్‌లో అగ్గి రాజేసిందెవరు, అదుపు తప్పిన యువకులతో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, క్షణాల్లో రైల్వే స్టేషన్ అంతటా దట్టమైన మంటలు

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పృధ్వీ ఏ 12 నిందితుడిగా ఉన్నాడు. అతనితో పాటు మరో తొమ్మిది మంది నిందితులను గుర్తించారు. ఇప్పటికే పృధ్వీకి వైద్య పరిక్షలు పూర్తయ్యాయి. మరికాసేపట్లో అతడిని రిమాండ్‌కు తరలించనున్నారు. కాగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో విచారణ కొనసాగుతోంది. నరసరావుపేట నుంచి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి ఆవుల సుబ్బారావును తరలించారు. 10 మంది వాట్సప్ గ్రూప్ అడ్మిన్లు ఆందోళన కారులు సహా ఇప్పటి వరకూ పోలీసులు 55 మందిని అరెస్ట్ చేశారు.

సికింద్రాబాద్ ఘటనలో సుబ్బరావ్‌తో పాటు కరీంనగర్‌కు చెందిన రాజశేఖర్ అనే మరో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ ఘటన పై అధికారులు లోతుగా దర్యాప్తు నిర్వర్తిస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. స్టేషన్ బయట పార్కింగ్ లో ఉన్న టూ వీలర్స్ నుంచి అభ్యర్థులు పెట్రోల్ తీసుకున్నారు. స్టేషన్‌లో మొత్తం మూడు పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. బైక్‌లలో పెట్రోల్ తీసుకుని స్టేషన్ లోపలికి వెళ్ళి బోగీలను అభ్యర్థులు తగలబెట్టారు. మరికొందరు తమ వెంట బయట నుంచి పెట్రోల్ తెచ్చుకున్నారు. ఏ ఏ పెట్రోల్ బంక్‌లలో పెట్రోల్ తీసుకున్నారో ఇప్పటికే పోలీసులు గుర్తించారు.

సికింద్రాబాద్‌లో రైళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు, అగ్నిపథ్‌ ఆందోళనతో రణరంగంగా మారిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway station) అల్లర్ల కేసులో.. 10 మంది వాట్సాప్‌ గ్రూప్(Whatsapp Group) అడ్మిన్లను పోలీసులు(Police) అరెస్ట్ చేశారు. 8 వాట్సాప్ గ్రూపుల ద్వారా అభ్యర్థులను అడ్మిన్లు రెచ్చగొట్టినట్టు విచారణలో తేలింది. రైల్వేస్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్.. చలో సికింద్రాబాద్ ARO3, ఆర్మీ GD2021 మార్చ్ ర్యాలీ జరిగింది. CEE సోల్జర్ గ్రూపులను అభ్యర్థులు క్రియేట్ చేశారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా రైల్వేస్టేషన్లలో విధ్వంసానికి ప్లాన్ చేశారు.

అగ్నిపథ్‌ స్కీమ్‌ను కేంద్ర వెనక్కి తీసుకోవాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌ వల్ల భారత ఆర్మీ బలహీనపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో తమ పార్టీ తలదూర్చదని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంపై జరిగిన సమావేశానికి శరద్‌పవార్‌ తనకు ఫోన్‌ చేసి ఆహ్వానించారు. అయితే పవార్‌ ఆహ్వానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ పాత్ర తక్కువ అంచనా వేయొద్దు అని అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు.