Hyderabad, Nov 24: ఆర్మీలో (Army) చేరాలనుకునే యువతీయువకులకు శుభవార్త. ఆర్మీ రిక్రూట్ మెంట్ బోర్డు.. అభ్యర్ధుల ఎంపికకు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో డిసెంబర్ 8 నుండి 16 వరకు హైదరాబాద్ లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (Agniveer Recruitment Rally) నిర్వహిస్తోంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నియామక ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని అధికారులు వివరించారు.
ఏ పోస్టులకు.. ఎవరు అర్హులు?
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్, స్టోర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత, ట్రేడ్స్ మెన్ లకు 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని డిఫెన్స్ విభాగం తెలిపింది. వివరాలకు 040-27740059, 27740205 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించింది.