KCR National Party: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ఫిక్స్, కొత్త పార్టీకోసం వందకు పైగా పేర్లను పరిశీలించిన కేసీఆర్,ఆ పేరే ఎందుకు పెట్టారో తెలుసా?  జాతీయ రాజీకీయాల్లో ఎంట్రీకి సర్వం సిద్ధం, గ్రాండ్‌గా జాతీయ పార్టీ ప్రకటన కోసం ఏర్పాట్లు
CM KCR Speech (Photo-Twitter)

Hyderabad, OCT 05: కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ( announcement of national party) కౌంట్ డౌన్ దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు గులాబీ నేతలు. తెలంగాణ భవన్ లో (Telanagana Bhavan) ఇవాళ నిర్వహించబోయే సమావేశ ఏర్పాట్లను ఎమ్మెల్సీ మధుసూదనా చారి పలువురు టీఆర్ఎస్ (TRS) నేతలు పరిశీలించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన కోసం 283 మంది ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. దీంతో సమావేశం హాల్ లో సిట్టింగ్ ఏర్పాట్లు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రత్యేక ఆహ్వానితులు కూర్చునే రూమ్స్ లో వసతులు పరిశీలించారు. బుధవారం తెలంగాణ భవన్ లో జరిగే సర్వసభ్య సమావేశంలో పేరుమార్పుపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ (KCR) తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. 283 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారు. మధ్యాహ్నం 1.19 గంటలకు తీర్మానంపై కేసీఆర్ సంతకం చేస్తారు. సభ్యులు ఆమోదించిన తీర్మానంపై కేసీఆర్ ప్రకటన చేస్తారు.

Telangana: వైరల్ వీడియో, కేసీఆర్ పీఎం కావాలని కోళ్లు, మద్యం పంపిణీ చేసిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి, దసరాకు జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సీఎం కేసీఆర్  

టీఆర్ఎస్ స్థానంలో ఏర్పాటయ్యే పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి(BRS)గా కేసీఆర్ ఖరారు చేశారు. దాదాపుగా వందకుపైగా పేర్లను పరిశీలించిన అనంతరం కేసీఆర్ బీఆర్ఎస్ (BRS) పేరును ఎంపిక చేశారు. భారత్ రాష్ట్ర సమితి (Bharat rastra samithi) అంటే హిందీలోనూ అందరికీ అర్థమవుతుందని, హిందీలో భారత దేశ సమితి అనే అర్థం వస్తుందనే ఉద్దేశంతో ఈ పేరును ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంన్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకోనున్నారు. సీఎం కేసీఆర్ పార్టీ (CM KCR Party) ప్రకటన అనంతరం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరిపేలా టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సర్వసభ్య సమావేశంకు 283 మంది సభ్యులు పాల్గోనున్నారు. అంతేకాక సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి (Kumaraswamy), తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్ తదితరులు హాజరు కానున్నారు. మంగళవారం సాయంత్రమే వీరు హైదరాబాద్ కు చేరుకున్నారు. వారికి బేగంపేట విమానాశ్రయంలో మంత్రి కేటీఆర్ (KTR), శాసనసభ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు స్వాగతం పలికారు.

KCR National Party: మునుగోడులో జాతీయ పార్టీగానే పోటీ చేస్తాం! కేసీఆర్ జాతీయ పార్టీ పేరు, ముహుర్తం ఖరారు, దసరా రోజు టీఆర్‌ఎస్ పార్టీ పేరు మార్పుపై ప్రకటన, 300 మంది కార్యవర్గ సభ్యులతో సమావేశం, డిసెంబర్ 9న ఢిల్లీలో బహిరంగ సభ  

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ ను భారీగా అలంకరించారు. భవన్ చుట్టుపక్కలా, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జాతీయ పార్టీని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ప్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు.