Hyderabad, Sep 18: సికింద్రాబాద్ (Secunderabad) లోని ఆల్ఫా హోటల్ (Alpha Hotel) ను జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు సీజ్ చేశారు. హోటల్‌లో (Hotel) అపరిశుభ్ర వాతావరణం, కస్టమర్లకు నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు చేపట్టి హోటల్ మూయించేశారు. ఈ హోటల్‌పై ఈ నెల 15న కొందరు అధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. అంతకుముందు కొద్ది రోజులుగా హోటల్‌లోని అపరిశుభ్ర వాతావరణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.
Secunderabad: Alpha Hotel booked after customer falls ill after consuming 'Mutton Kheema Roti' https://t.co/ypMU82i2gH
— Qamer Uddin (@QamerUddin12548) September 17, 2023
స్టేట్ ఫుడ్ లాబ్ కు..
ఈ నేపథ్యంలో ఆదివారం హోటల్‌లో తనిఖీలు నిర్వహించి సీజ్ చేసిన అధికారులు అక్కడి శాంపిళ్లను పరీక్షల కోసం నాచారంలోని స్టేట్ ఫుడ్ లాబ్ కు పంపించారు. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని వారిని హెచ్చరించారు. తదుపరి చర్యలు తీసుకునే వరకూ హోటల్‌ను మూసేశారు.