IT Minister kTR (Photo-Twitter)

Hyd, April 14; భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌కు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ (Minister KT Rama Rao) ట్వీట్ చేశారు. ఎంత కాలం జీవించామన్నది కాదు.. ఎంత గొప్పగా జీవించామన్నదే జీవితం అనే అంబేద్క‌ర్ సూక్తిని కేటీఆర్ ట్వీట్ చేశారు. భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధ్య‌మైంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగ‌మం చేసిన ఆ మ‌హానీయుడికి నివాళుల‌ర్పిస్తున్నాన‌ని (Ambedkar Jayanti 2022) కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని పీవీ మార్గ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్టర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహం (Telangana Govt to Install 125-Feet Tall) పనులు ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా (Dr BR Ambedkar Statue by December) పూర్తవుతాయని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. అదేవిధంగా 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్లతో అంబేద్కర్‌ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహ పనులను షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు.

డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ 131వ జయంతి, నివాళి అర్పించిన ఏపీ సీఎం జగన్

సంబంధిత అధికారులను అడిగి పనుల పురోగతిని తెలుసుకొన్నారు. పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చూపిన బాటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని, సబ్బండ వర్ణాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు కొనియాడారు. అంబేద్కర్‌ చూపిన బాటలో నడుస్తూ ప్రజలందరి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణలో ఇప్పుడు అభివృద్ధి ఉద్యమం నడుస్తున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని వివరించారు.

జీవో 111 ఎత్తివేస్తూ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం, ఇక హైదరాబాద్ శివారు భూములు ఇక బంగారమే, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రెక్కలు, పర్యావరణ వేత్తల ఆందోళన

అన్ని అంశాలలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. పీవీమార్గ్‌లో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్‌ 125 అడుగల కాంస్య విగ్రహం దేశానికే తలమానికంగా నిలుస్తుందని వివరించారు. విగ్రహంతోపాటు మ్యూజి యం, గ్రంథాలయం, ఫొటో గ్యాలరీ, ధ్యానమందిరం, మీటింగ్‌ హాళ్లు, క్యాంటీన్‌లను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.డిసెంబర్‌లోగా పనులన్నీ పూర్తవుతాయని పేర్కొన్నారు.