Heavy Rains (Photo-Twitter)

Hyderabad, July 05: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రానున్న 48 గంటలపాటూ భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని వాతావరణశాఖ అలర్ట్ (Alert)జారీ చేసింది. పశ్చిమతీర ప్రాంతంలో ద్రోణి విస్తరించడంతో అరేబియా సముద్రం నుంచి బలమైన ఈదురుగాలులు గట్టిగా వీస్తున్నాయి. ఫలితంగా కోస్తా(Kostha), రాయలసీమ(Rayalaseema), ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పుడుతున్నాయి. బలమైన ఈదురుగాలుల కారణంగా చెట్లు విరిగిపడుతున్నాయి. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. అటు తెలంగాణలో(Telangana) రాబోయే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ(IMD) ప్రకటించింది.తెలంగాణకు యెల్లో(Yellow), ఆరెంజ్ అలర్ట్స్ (Orange Alert) జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని తెలిపింది. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కనిపిస్తోందని ఐఎండీ తెలిపింది.

ఐఎండీ ప్రకారం హైదరాబాద్‌ లో (Hyderabad) ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Moderate Rains) కురుస్తాయి. ఉరుములు, మెరుపులు కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీని ప్రకారం జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. యెల్లో అలర్ట్ ప్రకారం ఆదిలాబాద్, కుమ్రం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జయ శంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

Andhra Pradesh: పిల్లల మాదిరిగా స్కూలు బ్యాగ్ తగిలించుకున్న సీఎం జగన్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఇదే.. 

మరికొన్ని జిల్లాలకు జులై 7న ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీని ప్రకారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, యెల్లో అలర్ట్ ప్రకారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. జూలై 8, 9 తేదీల్లో యెల్లో అలర్ట్ ప్రకారం ఆదిలాబాద్, కుమ్రం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండీ హెచ్చరికల ప్రకారం ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. ఇక హైదరాబాద్ నగరంలో మాన్ సూన్ టీమ్‌ లను రెడీగా పెట్టారు. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.