Akbaruddin Owaisi and BJP MP Navneet Rana (photo-Video Grab)

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ 3,15,811 ఓట్లతో బీజేపీ అభ్యర్థి మాధవి లత పై గెలుపొందారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో ఎనిమిది చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఇరుపార్టీలకు చెందిన మెజార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో దూసుకెళుతున్నారు.

ఖమ్మం లోక్ సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 3.5 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి అత్యధిక మెజార్టీ దిశగా సాగుతున్నారు. ఆయన మెజార్టీ ఇప్పటికే 5 లక్షలు దాటింది. భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌పై 1.85 లక్షల మెజార్టీతో ఉన్నారు.  తగ్గేదేలే అంటున్న ఈటెల రాజేందర్, మ‌ల్కాజిగిరిలో ల‌క్ష 40వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి

బీజేపీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తదితరులు లక్షకు పైగా మెజార్టీతో ఉన్నారు. మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్ 2 లక్షలకు పైగా మెజార్టీతో సాగుతున్నారు. మెదక్ నుంచి రఘునందన్ రావు, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డిలు 30వేల నుంచి 70వేల మెజార్టీతో ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ స్వల్ప మెజార్టీతోనే ఉన్నారు.

కంచుకోట మెదక్ లో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది.బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 33,323 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. రఘునందన్ రావు 4,20,709 ఓట్లతో ఉన్నారు. రెండోస్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం ముదిరాజ్ 3.87 లక్షల ఓట్లతో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి 3.62 లక్షల ఓట్లతో మూడోస్థానంలో కొనసాగుతున్నారు.  త‌ల‌కిందుల‌వుతున్న ఎగ్జిట్ పోల్స్, భారీ న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు, ల‌క్ష‌ల కోట్ల ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ఆవిరి

మెదక్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేసీఆర్ (గజ్వేల్), హరీశ్ రావు (సిద్దిపేట) అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడా బీజేపీయే ముందంజలో ఉంది. హరీశ్ రావు సొంత నియోజకవర్గంలో బీజేపీ ముందంజలో ఉండగా, గజ్వేల్‌లో బీఆర్ఎస్‌కు గట్టి పోటీని ఇస్తోంది. కేవలం దుబ్బాకలో మాత్రమే బీఆర్ఎస్‌కు కొంత సానుకూలత కనిపిస్తోంది. జహీరాబాద్ లోక్ సభలోనూ బీఆర్ఎస్ మూడోస్థానానికి పడిపోయింది.