Image used for representational purpose | (Photo Credits: File Image)

Hyderabad, Mar 7: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో సంపన్నులు నివసించే బంజారాహిల్స్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి యజమాని పని మనిషిని ఫ్లాట్‌లో బంధించి రెండు వారాలుగా లైంగిక దాడికి (Banjara Hills House Owner Sexual Harassment) పాల్పడ్డారు. దారుణ ఘటప వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నంబర్‌ 1905లో ఉదయ భాను(52) అనే వ్యాపారి నివసిస్తున్నాడు. సినిమా పరిశ్రమలో పని చేస్తున్న ఇతడు గత నెల 17వ తేదీన రాజమండ్రి నుంచి ఓ పని మనిషిని రప్పించుకున్నాడు. ఆమెకు అదే అపార్ట్‌మెంట్‌లో చిన్న గదిని కేటాయించారు.

కాగా, అదే నెల 18వ తేదీన ఆమె పని చేస్తుండగా బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి (Sexual Harassment) పాల్పడ్డాడు. ఈ విషయం బయటికి పొక్కితే నిన్ను, నీ కూతురును చంపేస్తానంటూ బెదిరించాడు. అంతే కాదు ఆమె సెల్‌ఫోన్‌ కూడా తన వద్దే పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఆమెను బెదిరిస్తూ లైంగికదాడికి పాల్పడటమే కాకుండా గదిలో బంధించి బయటి నుంచి తాళం వేసి వెళ్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె కూతురికి చెప్పడానికి కూడా వీల్లేకుండా పోయింది.

27 ఏళ్ల క్రితం ఇద్దరు అత్యాచారం, తండ్రి ఎవరో చెప్పాలంటూ నిలదీసిన కొడుకు, కోర్టు గడప తొక్కిన మహిళ, డీఎన్ఏ పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశాలు, యూపీలో విచిత్ర ఘటన

ఈ నెల 5వ తేదీన నిందితుడు ఉదయ భాను లాక్ వేసి బయటికి వెళ్తున్న సమయంలో చాకచక్యంగా ఆమె తన సెల్‌ఫోన్‌ను తీసుకొని కూతురికి జరిగిన విషయం చెప్పింది. ఆందోళన చెందిన కూతురు 100కు ఫోన్‌ చేసింది. పోలీసులు వెంటనే సెల్‌సిగ్నల్‌ ఆధారంగా కేసును ఛేదించి ఫిలింనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు గుర్తించారు.

శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఎస్‌ఐ రాంబాబు సిబ్బందితో కలిసి అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ఫ్లాట్‌లో బంధించిన బాధితురాలికి విముక్తి కలిగించి ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ భానుపై ఐపీసీ సెక్షన్‌–342, 376(2), 323, 504, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.