Hyderabad, August 10: తెలంగాణ జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు సోమవారం భూమి పూజా కార్యక్రమం (Bhoomi Pooja) సంధర్భంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ప్రభుత్వంపై (JP Nadda Slams Telangana Govt) విరుచుకుపడ్డారు. వర్చువల్ వేదికగా ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన (BJP president JP Nadda) తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో (corruption) కూరుకుపోయిందని విమర్శలు గుప్పించారు. 45వేల కోట్ల రూపాయలకు పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజక్టును ( Kaleshwaram project) దోచుకోవటం కోసమే 85వేల కోట్లకు పెంచారని ఆరోపించారు.
గడిచిన ఆరేళ్ళుగా తెలంగాణ ప్రజలకు చేసిందేంటో సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చారని నిలదీశారు. ఏడు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని 50వేల ఇళ్ళు కూడా కట్టలేదని జేపీ నడ్డా దుయ్యబట్టారు.
కోవిడ్ 19 మహమ్మారి కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని కేంద్రం ఒక అవకాశంగా మలుచుకుని పనిచేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఓవైపు కేంద్రం కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతుంటే... తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనా కట్టడిలో విఫలమైందని జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడట్లేదని నడ్డా విమర్శించారు. కరోనా కట్టడిపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ కుంభకర్ణుడి నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. కరోనా టెస్టులు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిపోయిందన్నారు. తెలంగాణలో తాజాగా 1256 కరోనా పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో 80 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 637కు పెరిగిన మరణాల సంఖ్య
లోక్‌సభ ఎన్నికల్లో షాకిచ్చినట్లు గానే... అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు కేసీఆర్‌కు బుద్ది చెప్పాలని అన్నారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవటం వల్ల 98 లక్షల మంది భీమా సౌకర్యం కోల్పోయారని అన్నారు.కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టిందని..ప్రజలు సహకరించాలని జేపీ నడ్డా కోరారు. కరోనాను ఎదుర్కోడంలో ప్రపంచానికే ప్రధాని మోదీ ఆదర్శంగా నిలిచారని ఆయన అన్నారు. దేశంలో తాజాగా 62,064 కేసులు నమోదు, 22 లక్షలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, యాక్టివ్‌గా 6,34,945 కేసులు, మరణాల సంఖ్య 44,386
బీజేపీ కార్యాలయాల గురించి మాట్లాడుతూ.. కార్యకర్తల కోసం ప్రతీ జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనేది ప్రధాని మోదీ ఆలోచన అన్నారు. అందుకు అనుగుణంగానే పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు తదితరులు పాల్గొననున్నారు.