Borewell Death: నిర్లక్ష్యానికి మూడేళ్ల బాలుడు బలి, బోరుబావిలో పడిన బాలుడు ఆక్సిజన్ అందక మృతి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్‌ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలింపు
3-Year-Old boy died in Telangana's Medak district after falling into a borewell (Photo Credits: ANI)

Hyderabad, May 28: మెదక్‌ జిల్లాలోని పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో బోరుబావిలో పడిన బాలుడు (Boy Falls Into Borewell) మృతి చెందాడు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బోరు బావిలోపడిన సంజయ్‌ సాయి వర్దన్‌‌ని ప్రాణాలతో వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. 120 అడుగుల లోతు వేయించిన బోరు బావిలో 17 అడుగుల వద్ద బాలుడి మృతదేహం (Borewell Death) లభ్యమైంది. బోరు బావిలో పడిన మూడేళ్ల బాలుడు, 25 ఫీట్ల లోతులో ఉన్నాడని అంచనా, సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు

ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం 12 గంటల పాటు శ్రమించిన అనంతరం బోరుబావిలో మట్టిపెళ్లలు కింద బాలుడి మృతదేహం లభ్యమైంది. అప్పటివరకు తమ కన్నకొడుకు బతుకుతాడేమో అని వేయి కళ్లతో ఎదురుచూసిన సాయి వర్ధన్ తల్లిదండ్రుల దుఖానికి అంతులేకుండా పోయింది. బాలుడు ఇక లేడని తెలియడం అందరినీ కంటతడి పెట్టించింది.

12 గంటల పాటు పడిన శ్రమ ఫలించక బాలుడు విగత జీవిగా కనిపించాడు. బోరుబావి నుండి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆక్సిజన్‌ అందక బాలుడు మృతిచెందినట్లుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్‌ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ANI's Tweet:

సహాయక చర్యలు పూర్తయ్యేంత వరకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, జిల్లా ఎస్పీ చందన దీప్తి సంఘటనా స్థలంలోనే ఉన్నారు. బోర్లు విఫలమైతే వెంటనే పూడ్చి వేయాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా రైతులకు సూచించారు. అనుమతి లేకుండా బోర్లు వేసిన రిగ్గు యజమానిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు.