Hyd, Oct 04: సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు మాజీ మంత్రి హరీశ్ రావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రైతు ధర్నా కర్యక్రమంలో మాట్లాడిన హరీశ్..రేవంత్ తీరును ఎండగట్టారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీయిజం నడుస్తుందని...హైడ్రా పేరుతో అరాచకం చేస్తున్నారని దుయ్యబట్టారు. మూసిని ఆనుకొని ఉన్న పేదల ఇళ్ళ్ళు కూల గొడితే ఊరుకోం అని తేల్చిచెప్పారు. ఇంకెప్పుడు ఇస్తారు రైతు బంధు అని ప్రశ్నించారు.
కమిటీ వేసిండు, అసెంబ్లీలో మాట్లాడతా అన్నడు, దసరాకి ఇస్తామని ఇంకో మంత్రి అంటాడు... దసరా పండుగ లోపు రైతులందరికీ రైతు బంధు ఇవ్వాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు. రైతులదరికి రుణమాఫీ చేసేదాకా వదిలి పెట్టం అని తేల్చిచెప్పారు. ఒక్క బస్సు తప్ప ఆరు గ్యరేంటీలు తుస్సే... ప్రభుత్వం మాటలు నమ్మి 2 లక్షల పైన అప్పు కడితే రుణమాఫీ కాలేదు అన్నారు. రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు చేస్తావ్... నీకు చెవులు, కళ్ళు ఉంటే చెయ్యి అని డిమాండ్ చేశారు. రైతుల మీద మిత్తి పడుతుంది... నువ్వు మాఫీ చెయ్యకుంటే పరిస్థితి ఏం కావలె అన్నారు. రెండు లక్షల రుణమాఫీ కాలేదని మహబూబ్ బాద్ లో రవి ఆత్మహత్య చేసుకున్నాడు....పది నెలల పాలనలో రేవంత్ రెడ్డి కి రైతులు, ప్రజలు అంటే పట్టింపు లేదు అన్నారు.
మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నడు... డిసెంబర్ 9 అన్నడు. ఆగష్టు 15 అన్నడు అన్నారు. కొమురవెల్లి మల్లన్న, యాదాద్రి , భద్రాద్రి, సమ్మక్క సారలమ్మ మీద ఒట్టు పెట్టీ మొనగాడు లెక్క మాట్లాడిండు...కానీ ఇప్పుడు మొనగాడు కాదు మోసగాడు అని తేలిపోయిందన్నారు. రైతు బంధు, రుణమాఫీ, పింఛన్లు, మహాలక్ష్మి అన్ని చేస్తా అన్నాడు. ఇప్పుడు సపుడు లే.. మొత్తం రుణమాఫీ అయ్యింది రాజీనామా చెయ్యి హరీష్ రావు అని సవాల్ విసిరిండు... రుణమాఫి అయితే ఎందుకు ఇంత మంది వచ్చారు అని ప్రశ్నించారు హరీశ్ రావు.
పాలకుర్తి మండలం లోనే 4314 మందికి రుణమాఫీ కాలేదు అని.. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 15 వేలు అన్నడు. కాలేదు అన్నారు. భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు అన్నడు కాలేదు...రైతు కూలీలు, భూమి లేని రైతులకు పంట బీమా పథకం అన్నడు. కాలేదు
పోడు, అసైండ్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తా అన్నడు. కాలేదు అన్నారు. అన్ని రకాల పంటలకు 500 బోనస్ అని, ఇప్పుడు సన్నాలకి మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నడు అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ, పార్టీకి చెడ్డ పేరు రావొద్దు...అక్రమమైతే నేనే కూలుస్తానని కామెంట్
ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నడు. పది నెలల్లో ఎన్ని ఇచ్చినవ్ చెప్పాలన్నారు. కెసిఆర్ పరీక్షలు పెట్టిన 30,000 ఉద్యోగాలు తప్ప నువ్వు ఇచ్చిందేమీ లేదు... మిగిలిన రెండు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతావా చెప్పాలన్నారు. తల్లులను, తండ్రులను, విద్యార్థులను మోసం చేసిండు.... డి ఏ లు ఇవ్వక ఉద్యోగులను మోసం చేసిండు అని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మాది ప్రజల పక్షం.... పాలకుర్తి పనులు ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. బతుకమ్మ చీరలు లేదా నువ్వు ఇస్తానన్న 500 రూపాయలు మహిళలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు. శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాలో చెప్పాలి..ఉప ఎన్నికలు రావడం ఖాయం రాజయ్యను గెలిపించుకోవాలన్నారు హరీశ్.