Hyd, January 3: ప్రభుత్వ అధికారులను రైతులు శాసించే స్థాయికి కేసీఆర్ తీసుకువస్తే.. కాంగ్రెస్ వాళ్లు ఏమో రైతు అడుక్కోవాలని, రైతును భిక్షగాడిని చేయాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్... రైతు భరోసా పంట సాగు చేసిన భూమికే ఇస్తామని లంగా మాటలు మాట్లాడుతున్నారు అని దుయ్యబట్టారు.
పత్తి పంట, కంది పంట, మిర్చి పంట, చెరుకు పంటలు పండించే రైతులు సంవత్సరానికి ఒకటే పంట పండిస్తారు.. పోడు రైతులు సంవత్సరానికి ఒక్కటే పంట పండిస్తారు అన్నారు. పామాయిల్, మామిడి, బత్తాయి, నిమ్మ తోటలన్నీ ఒకటే పంట కిందికి లెక్క కడుతున్నారు అన్నారు. వానాకాలం పంట కోటిన్నర ఎకరాల్లో పెడితే, యాసంగిలో దాంట్లో సగం ఎకరాల్లో పంట సాగు అవుతుందన్నారు.
రైతు భరోసా పంట సాగు చేసిన భూమికే ఇస్తామని సగం మంది రైతులకు ఇవ్వకుండా ముంచుదామని చూస్తున్నారు అని..మతి తప్పిన బేమాన్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. కేసీఆర్ ఫ్యామిలీపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..కల్వకుంట్ల కుటుంబమంతా కేసుల మయం, త్వరలో కేటీఆర్ జైలుకు వెళ్తారన్న కడియం
రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే ఏ ఊర్లో రైతు కూలీలు ఎంత మంది ఉన్నారో, వాళ్లకి ఎంతెంత బాకీ పడ్డావో ఆ లిస్ట్ పెట్టు అన్నారు. రైతుబంధు పథకాన్ని లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడుని.. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్...ఎన్నికలు అయిపోయాక రైతులు డిక్లరేషన్ ఇవ్వలంట అని ఎద్దేవా చేశారు.
BRS KTR fires on CM Revanth Reddy Over Rythu Bharosa
ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్
ఎన్నికలు అయిపోయాక రైతులు డిక్లరేషన్ ఇవ్వలంట
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 రోజులకు ప్రజాపాలన అప్లికేషన్ పేరిట రైతు భరోసా కోసం కూడా దరఖాస్తులు పెట్టించారు
విచిత్రం ఏంది అంటే మళ్లీ రైతులు ఊర్లల్లో ప్రమాణ పత్రం ఇవ్వాలని.. లేకుంటే డబ్బులు రావని కొత్త… pic.twitter.com/QfP8AC2Dvc
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 రోజులకు ప్రజాపాలన అప్లికేషన్ పేరిట రైతు భరోసా కోసం కూడా దరఖాస్తులు పెట్టించారు...విచిత్రం ఏంది అంటే మళ్లీ రైతులు ఊర్లల్లో ప్రమాణ పత్రం ఇవ్వాలని.. లేకుంటే డబ్బులు రావని కొత్త డ్రామా చేస్తున్నారు - కేటీఆర్రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఎకరానికి రూ.17,500 చొప్పున రైతుబంధు బాకీ పడిందన్నారు.ఒక్కో రైతుకు, ఎన్ని ఎకరాలకు ఎంత బాకీ ఉందో ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం అన్నారు.