Hyd, Aug 2: తెలంగాణలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యారంగ పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తూనే విద్యారంగ ప్రయోజనాల గురించి కీలక సూచనలు చేశారు.
() 2017లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలలో ఇచ్చిన హామీ మేరకే 10,468 పండిత, పీఈటీ పోస్టుల అప్ గ్రేడేషన్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు.
() ప్రస్తుత ఉపాధ్యాయుల పదోన్నతులకు, బదిలీలకు కూడా గతప్రభుత్వమే సెప్టెంబర్ నెలలో లాంఛనాలు పూర్తిచేసిందని దీనిపై స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు వెలువరించి ఆదేశాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
() కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కనీసం పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను ఎప్పుడు అనుమతిస్తారో ఆ సంగతన్నా సభలో ప్రకటిస్తే అందరూ సంతోషిస్తారన్నారు.
()న్యూ పెన్షన్ స్కీం స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకువస్తామన్నారు. ఎప్పటి నుంచి అమలుచేస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే బండ్ల భేటీ, కాంగ్రెస్‌లోనే కొనసాగే అవకాశం, బీఆర్ఎస్ నేతల నిరాశ
() పాఠశాలలకు స్కావెంజర్స్‌ను అనుమతిస్తామన్నారు. అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామన్నారు. ఇప్పటికీ దానిపై నిర్ణయం ప్రకటించలేదు వాటినీ పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.
()బదిలీ అయినా ఇప్పటివరకూ రాష్ట్రంలో నూతన పాఠశాలలో చేరని ఎస్టీజీ ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని, ఖాళీలు ఏర్పడిన పాఠశాలలో అవసరమైన మేరకు విద్యావాలంటీర్లను వెనువెంటనే నియమించాలి.
()మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని పలు అంశాలను ప్రస్తావించారు హరీష్ రావు.
Here's Tweet: