Hyd, January 3: తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ ఉన్నతాధికారులకు కీలక సూచన చేశారు. తెలంగాణ లో గత ముప్పయి రోజుల్లోనే ఆరు మంది పోలీసులు తమ విలువైన ప్రాణాలను చేజేతులా నాశనం చేసుకున్నారు. నిన్న కూడా ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరంపర ఇంతటితో ఆగాలన్నారు.
ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్..
ప్రియమైన పోలీసు మిత్రులారా,
1. జీవిత భాగస్వామి ఎంపికలో జాగ్రత్త . డేటింగ్ చెడ్డదేం కాదు. గౌరవంగా ట్రై చేయండి. వరకట్నం ఆపండి. పెళ్లి వ్యాపారం కాదు. మీ కుటుంబం ఫోటోను మీరు పనిచేస్తున్న ప్రదేశంలో ఉంచుకోండి. మీ సెల్ ఫోన్ వాల్ పేపర్ గా మార్చుకోండి.
2. మీరు డ్యూటీ లు బాగా చేయండి, డ్యూటీ అయిపోయిన తరువాత మాత్రం కుటుంబం తో గడపండి, సెల్ ఫోన్ తో కాదు.
3. వీలయినప్పుడల్లా కనీసం రోజుకు గంట సేపు వ్యాయామం చేయండి. పోలీసు అకాడమీ రోజులను గుర్తు చేసుకోండి. బిజీ గా ఉన్నామని మాత్రం తప్పించుకోకండి.
4. బందోబస్తులో ఉన్నపుడు ఖాళీ సమయాన్ని ఫోన్లో బెట్టింగ్, ఈజీ లోన్, చాటింగ్ యాప్ లకు కేటాయించకుండా మంచి పుస్తకాలు చదవండి.
5. దయచేసి ఏదైనా ఒక గేమ్ ను (ఆన్లైన్ కాదు) అలవాటు చేసుకోండి. క్రీడాకారులు ఆత్మహత్యలు చేసుకోరు గమనించండి.
6. బెట్టింగ్, సట్టా, మట్కా, చీప్ లోన్, ఫేక్ క్రిప్టోకరెన్సీ ఇవన్నీ గంజాయి లాంటి వ్యసనాలు. వీటికి దూరంగా ఉండండి.
7. పోలీసులకు ప్రత్యేకంగా అపరిచిత వ్యక్తులతో చాటింగ్ బెడద ఉంటది. అలాగే మన దగ్గరికి నిస్సహాయ పరిస్థితి లో వచ్చిన వ్యక్తుల బాధను అర్థం చేసుకోవాలి, సహాయం చేయాలి కాని వాళ్లతో రిలేషన్స్ కంటిన్యూ చేయకూడదు
8. ఎవరైనా పై అధికారులు సైకోల్లాగా ప్రవర్తిస్తే, సెలవు పెట్టి వెళ్లండి లేదా వేరే ప్రాంతానికి బదిలీ చేయించుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి
9. మానసిక ఒత్తిడి ఉన్నపుడు కౌన్సిలర్ల వద్దకు వెళ్లి మీ సమస్యలు వారికి చెప్పుకోండి. ఉపశమనం కలుగుతుంది.
10. బాగా డబ్బు సంపాదించే ఆలోచన ఉండడం తప్పు కాదు. మీ కుటుంబ సభ్యులతో ఉద్యోగం లేదా వ్యాపారం చేయించండి. వాళ్లకు మీ రోజువారీ ఉద్యోగంతో, నేరస్తులతో సంబంధం లేకుండా చూసుకోండి. కేసీఆర్ ఫ్యామిలీపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..కల్వకుంట్ల కుటుంబమంతా కేసుల మయం, త్వరలో కేటీఆర్ జైలుకు వెళ్తారన్న కడియం
11. దయచేసి లంచాలకు, మామూళ్లకు(మంత్లీస్), అక్రమ సంపాదనకు దూరంగా ఉండండి. ఆ ఏసీబీ విజిలెన్స్ కేసులనుండి బయటపడాలంటే తీసుకున్న లంచం కన్నా వంద రెట్లు ఖర్చవుతుంది. అదెలా జరుగుతుందో మీకందరికీ తెలుసు.
12. సంవత్సరానికి ఒకసారి విపాసన (మెడిటేషన్) లేదా విహారయాత్రలకు కుటుంబంతో వెళ్లండి. మీరు పది రోజులు డ్యూటీలో లేకపోతే కొంపలేం మునగవు.
13. పక్క పోలీసు/ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులతో పోల్చుకోకండి. మనశ్శాంతి ఉండదు. కనిపించేదంతా బంగారం కాదు. ఎవరి బాధలు వాళ్లకుంటయి.
14. మీకిష్టమైన వ్యక్తుల పేరు మీద స్వచ్చంద సంస్థలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు సేవ చేయండి.
15. మీ కిష్టమైన మంచి పేరున్న పై అధికారులను(సర్వింగ్/రిటైర్డు) మార్గదర్శులు గా తీసుకోండి. వారిని తరచుగా కలవండి.