Hyderabad, Mar 16: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC), మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) కుమార్తె కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అరెస్ట్ మరో ట్విస్ట్ చోటుచేసుకున్నది. కవిత సోదరుడు, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీసులకు ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు. కవిత అరెస్ట్ సమయంలో కేటీఆర్ తమ విధులకు ఆటంకం కలిగించారని ఈడీ అధికారి భాను ప్రియా మీనా ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేటీఆర్‌పై ఈడీ అధికారుల ఫిర్యాదు
విధులకు ఆటంకం కలిగించారని ఈడీ అధికారులు కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కవితను అరెస్ట్ చేసే సమయంలో చట్ట విరుద్ధంగా ఈడీ సోదాలు జరుపుతున్న ప్రదేశంలోకి 20 మందితో కలిసి వచ్చి విధులకు ఆటంకం కలిగించారని పంచనామా… pic.twitter.com/udVR0UY3kN
— Telugu360 (@Telugu360) March 15, 2024
అసలేం జరిగింది?
కవిత అరెస్ట్ సమయంలో ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. కవితను అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడెలా ఆమెను అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవని తెలిసే శుక్రవారం అరెస్టు చేసేందుకు వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.