burra venkatesham appointed as Telangana state public service commission chairmen

Hyd,Nov 30:  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్ పర్సన్ గా ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం నియామకమయ్యారు. డిసెంబర్ 2న ఆయన బాధ్యతలు స్వీకరించనుండగా ఇందుకు సంబంధించిన ఫైల్ పై తెలంగాణ గవర్నర్ సంతకం చేశారు.

కొత్త ఛైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశం ఉన్నారు. ఐఎఎస్ అధికారిగా ఉన్న వెంకటేశం వీఆర్ఎస్ తీసుకోనున్నారు. వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత వెంకటేశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. రైతుబంధును శాశ్వతంగా రద్దు చేసే కుట్ర..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో షేర్ చేసిన హరీశ్‌ రావు, రైతులను మోసం చేసి రైతు పండుగ నిర్వహిస్తారా అని ఫైర్

Here's Tweet:

ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న మాజీ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3తో పూర్తికానుంది.