Delhi, January 19: సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ కోసం రూ.450 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది క్యాపిటాల్యాండ్. క్యాపిటాల్యాండ్ గ్రూప్ నేతృత్వంలో హైదరాబాద్‌లో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ అభివృద్ధికి ముందడుగు పడింది. సింగపూర్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ కీలక ప్రకటన వెలువడింది.
ఇక సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం...ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి.
ముఖ్యంగా పట్టణాభివృద్ధి ప్రణాళిలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరులు - నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్లు, తయారీ, పర్యావరణం, స్థిరత్వ, సాంకేతికత సహా వివిధ రంగాలలో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భాగస్వామ్యాలపై చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. రేషన్ కార్డుల జారీ నిరంతరాయ ప్రక్రియ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన
ప్రధానంగా నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి నిర్వహణ, స్థిరత్వ ప్రణాళికల్లో తెలంగాణతో భాగస్వామ్యం అంశాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని వారు హామీ ఇచ్చారు. ఉమ్మడి ప్రాజెక్టులపై సాధ్యమైనంత వేగంగా ముందుకు పోవాలని, మరింత సమన్వయంతో పని కలిసి చేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.