Hyderabad, Nov 1: హైదరాబాద్ (Hyderabad) లోని బంజారాహిల్స్ సమీపంలోని కేబీఆర్ పార్క్ వద్ద ఓ పోర్షే కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ (KBR Park) వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు.. ఫుట్ పాత్ దాటి పార్క్ ప్రహరీ గ్రిల్స్ ను ధ్వసం చేసింది. అప్పటికీ అగని ఆ కారు.. చెట్టును ఢీకొట్టింది. వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో అందులో ఉన్న వారికి ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
బ్లేడ్లతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి.. మహిళలకూ గాయాలు.. ఏపీ తాడేపల్లిలో ఘటన (వీడియో)
గోడను ఢీ కొట్టి పల్టీలు కొట్టిన పోర్షే కారు
బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద కారు బీభత్సం. క్యాన్సర్ ఆసుపత్రి వైపు నుంచి అతివేగంగా వస్తూ అదుపు తప్పిన కారు. pic.twitter.com/vemmjicNID
— ChotaNews (@ChotaNewsTelugu) November 1, 2024
కారు నంబర్ ప్లేట్ ఎక్కడ?
ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో అది ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఫుట్ పాత్ పై ఉన్న క్యాన్సర్ రోగుల సహాయకులు, నిరాశ్రయులు ప్రాణ భయంతో పరుగులు తీసినట్లు స్థానికులు వెల్లడించారు.