Jangaon, Oct 19: అతను కారు డ్రైవింగ్ (Car Driving) నేర్చుకుంటున్నాడు. మాస్టర్ సరిగానే డ్రైవింగ్ సూచనలు ఇస్తున్నాడు. ఇంతలో ఓ చెరువు వచ్చింది. బ్రేకులు వెయ్యాలని స్టూడెంట్ కు మాస్టర్ ఆర్డర్ చేశాడు. అయితే, బ్రేకు బదులు యాక్సిలరేటర్ తొక్కాడు ఆ స్టూడెంట్. ఇంకేముంది? చక్కగా ఆ కారు చెరువులోకి (car plunged into the pond) దూసుకెళ్లింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన జనగామలోని (Jangaon) స్థానిక బతుకమ్మ కుంటలో జరిగింది. అయితే, స్థానికంగా ఉన్న మరో వ్యక్తి అప్రమత్తం అవ్వడంతో పెద్ద గండం తప్పినట్లయింది.
Here's Video:
డైవింగ్ నేర్చుకుంటుండగా చెరువులోకి దూసుకెళ్లిన కారు...
జనగామలోని స్థానిక బతుకమ్మ కుంట పక్కన ఉన్న గ్రౌండ్ లో ఓ వ్యక్తికి మరో వ్యక్తి కారు డ్రైవింగ్ నేర్పిస్తుండగా.. అయోమయానికి గురై బ్రేకు బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో కారు నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. వారిద్దరూ వెంటనే… pic.twitter.com/hG7u69zyrP
— BIG TV Breaking News (@bigtvtelugu) October 19, 2024
అలా జరిగింది
జనగామలోని స్థానిక బతుకమ్మ కుంట పక్కన ఉన్న గ్రౌండ్ లో స్టూడెంట్ అయిన ఓ వ్యక్తికి మరో వ్యక్తి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. ఈ క్రమంలో చెరువు గట్టు వరకు కారు వెళ్లింది. దీంతో కారు బ్రేకులు వెయ్యాలని మాస్టర్ అన్నాడు. ఐతే, అయోమయానికి గురై బ్రేకు బదులు యాక్సిలరేటర్ తొక్కాడు ఆ స్టూడెంట్. అలా కారు నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. వారిద్దరూ వెంటనే కారులోంచి చెరువులోకి దూకి స్థానికుడి సాయంతో ప్రమాదం నుండి బయట పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.