Cheddi Gang (Credits: Twitter)

Hyderabad, Aug 12: హైదరాబాదీల (Hyderabad) గుండెలు మళ్లీ గుభేల్ మంటున్నాయి. భయానక చెడ్డీ గ్యాంగ్ (Cheddi Gang) ఛాయలు మళ్లీ నగరంలో కనిపిస్తున్నాయి. ఇటీవల సిటీలోని మియాపూర్ (Miyapur), కూకట్ పల్లి (Kukatpally), మాదాపూర్ (Madhapur) ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫూటేజీలను పరిశీలించారు. దీంతో భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. రాత్రి వేళల్లో చెడ్డీ గ్యాంగ్ ఆగంతకులు కత్తులు పట్టుకుని వీధుల్లో సంచరిస్తున్నారు. నేర్పుగా మాటు వేసి.. అందరూ ఘాడ నిద్రలోకి వెళ్లిన తర్వాత.. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు.  మియాపూర్‌లో చెడ్డీ గ్యాంగ్ కదలికలను ఆ ప్రాంత ఎస్సై నిర్ధారించారు.  మియాపూర్‌ వసంత విల్లాలో చొరబడ్డ దొంగలు..  30 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. సీసీ కెమెరాల్లో  చెడ్డీ గ్యాంగ్ తచ్చాడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు ఈ సీసీ టీవీ ఫుటేజ్ సర్కులేట్ చేస్తూ..  ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాత్రివేళ్లలో ప్రజలంతా అలెర్ట్‌ గా ఉండాలని, ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

Karimnagar Shocker: కరీంనగర్ లో షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తున్న ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు.. మృతి.. కారణం ఇదేనా?

ఏమిటీ చెడ్డీ గ్యాంగ్ ?

చెడ్డీ గ్యాంగ్స్ ఎక్కువగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ లాంటి ప్రాంతాల నుంచి మన సౌత్‌ కు వస్తారు. మారణాయుధాలతో రాత్రుళ్లు సంచరిస్తూ ఉంటారు. ఒంటిపై చొక్కా, ఫ్యాంట్ లేకుండా, కేవలం చెడ్డీలు మాత్రమే ధరిస్తారు. ఎవరైనా పట్టుకున్నా తప్పించుకునేందుకు వీలుగా ఒళ్లంతా ఆయిల్ పూసుకుంటారు.

Viral Video: కర్మ ఫలితం ఇలానే ఉంటుంది, కారును తప్పించుకుని డివైడర్‌ని ఢీకొట్టిన బైకర్, క్యాప్షన్ ఇవ్వండంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్