
Hyderabad, SEP 27: అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో మూడో రోజూ జానీ మాస్టర్ ను (Jani Master) పోలీసులు విచారించారు. ఇప్పటికే బాధితురాలి నుంచి రెండుసార్లు స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆ వివరాల ఆధారంగా జానీని ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసుల కస్టడీలో (Police Custody) జానీ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. తనపై బాధితురాలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు జానీ (Choreographer Jani Master). ఓ టీవీ ప్రోగ్రామ్ ద్వారా తనకు తానుగా ఆమె పరిచయం చేసుకుందని జానీ తెలిపినట్లు సమాచారం.
మైనర్ గా ఉన్న సమయంలో ఆమెపై లైంగిక దాడి చేశాననేది అబద్ధం అని, ఆమె టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చినట్లు పోలీసులకు జానీ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా ఎంతో హింసించేదని, ఎన్నోసార్లు బాధితురాలు తనను బెదిరించిందని చెప్పారు జానీ. ఆ యువతి తీరుతో తానే చాలాసార్లు బాధపడ్డానన్నారు.
తాను పడుతున్న ఇబ్బందిని డైరెక్టర్ సుకుమార్ కు కూడా చెప్పానన్నారు. సుకుమార్ పిలిచి మాట్లాడినప్పటికీ బాధితురాలిలో మార్పు రాలేదన్నారు. తనపై కుట్ర జరిగిందని, దీని వెనుక ఎవరో ఉన్నారని, తన ఎదుగుదలను ఓర్వలేకనే తనను ఈ కేసులో ఇరికించారని పోలీసుల ఎదుట జానీ మాస్టర్ వాపోయినట్లు సమాచారం.