Hyderabad, May 19: కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో మార్చి 23న లాక్‌డౌన్ (Lockdown) విధించిన విషయం విదితమే. దీంతో పదో తరగతి పరీక్షలను (SSC Exams Postponed in TS) వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో కేవలం తెలుగు, హిందీ పరీక్షలు మాత్రమే జరిగాయి. మిగతా పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. అయితే పది పరీక్షల నిర్వహణపై మంగళవారం హైకోర్టులో (Telangana High Court) విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్
జూన్ 8 తర్వాత పదో తరగతి పరీక్షలు (SSC Exams in TS) నిర్వహించుకోవచ్చు అని హైకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉండాలని సూచించింది. భౌతిక దూరం సాధ్యం కాని కేంద్రాలను మార్చాలని ఆదేశించింది. కరోనా పరిస్థితులపై జూన్ 3వ తేదీన సమీక్ష నిర్వహించి, 4న నివేదిక సమర్పించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. . తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడగింపు, కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతావన్నీ గ్రీన్ జోన్లుగా ప్రకటించిన సీఎం కేసీఆర్, ఆర్టీసీ బస్సులు పున:ప్రారంభం సహా దాదాపు అన్ని కార్యకలాపాలకు అనుమతి
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ 8 నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించుకోవాలని అనుమతి ఇచ్చింది. టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. కాగాజూన్ 3న కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా జూన్ 4న కోవిడ్ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు సూచించింది.