CM KCR Huzurabad Tour: దళిత ప్రభుత్వ ఉద్యోగులకు దళిత బంధు వర్తింపు, దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది అవుతుందని తెలిపిన సీఎం కేసీఆర్, హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభోత్సవ సభ నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి
File image of Telangana CM KCR | File Photo

Huzurabad, August 16: భవిష్యత్‌లో భారత్‌లో జరగబోయే దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభోత్సవ సభ (CM KCR Launches Dalit Bandhu Scheme) నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ నాల్గో దశలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఎస్సీలకు దళితబంధు ఇస్తామని ప్రకటించారు. రాబోయే 15 రోజుల్లో ఇంకో రూ.2 వేల కోట్లు విడుదల చేస్తామని, దళితులు కూడా దనవంతులుగా మారి చూపించాలన్నారు.

దళితబంధు (Dalit Bandhu Scheme) ఇస్తామనగానే కిరికిరిగాళ్లు కొండి పెడుతున్నారని దుయ్యబట్టారు. పేదలకు రూపాయి ఇవ్వని పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయన కేసీఆర్‌ (CM KCR) ధ్వజమెత్తారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో 21 వేల దళిత కుటుంబాలున్నాయని తెలిపారు. హుజురాబాద్‌లో వచ్చేనెల, రెండు నెలల్లో అందరికీ దళితబంధు వస్తుందని చెప్పారు. మిషన్‌ భగీరథపై విపక్షాలు వెకిలి మాటలు మాట్లాడాయని, ఏ పథకం ప్రవేశపెడతామన్నా విపక్షాలవి అపోహలు, అనుమానాలేనని కేసీఆర్ తప్పుబట్టారు.

దళితబంధుకు మొత్తం 22 వేల కోట్లు ఇస్తాం. నేను హుజురాబాద్‌లో స్వయంగా తిరిగి దళితబంధు అమలును పరిశీలిస్తా. దళిత బంధుకు కిస్తీలు కట్టే కిరికిరి అవసరం లేదు. దళితులు కూడా దనవంతులుగా మారి చూపించాలి. హుజురాబాద్‌లో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నట్లుసమగ్ర సర్వేలో తేలింది. ఏ పథకం ప్రారంభించినా విపక్షాలకు అనమానులు, అపోహలే.  ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వస్తుంది. రాబోయే 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు విడుదల చేస్తాం.

ఇదే వేదిక నుంచి రైతుబంధు కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాను. ఆ రైతు బంధు కార్య‌క్ర‌మం ఈరోజు బ్ర‌హ్మాండంగా నడుస్తున్నది. వ్య‌వ‌సాయ రంగంలో అద్భుత‌మైన ఫ‌లితాలు సాధిస్తున్నాం. తెలంగాణ రైతాంగంలో ధీమా పెరిగింది. క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో జ‌రిగిన స‌భ‌లో రైతుబీమా ప్ర‌క‌టించాను. ఆ స్కీం అద్భుతంగా కొన‌సాగుతోంది. తెలంగాణ చ‌రిత్ర‌లో మ‌హోత్త‌ర‌మైన, కొత్త చ‌రిత్ర‌ను సృష్టించే, త‌ర‌త‌రాల దోపిడీ నుంచి, సామాజిక వివ‌క్ష నుంచి మ‌న ద‌ళిత స‌మాజం శాశ్వ‌తంగా విముక్తి పొందటానికి మరో ఉద్య‌మానికి శ్రీకారం చుడుతున్నాం.

నువ్వెంత నీ బతుకెంత..బండి సంజయ్‌పై విరుచుకుపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపాటి, మల్కాజ్ గిరి బంద్‌కు బీజేపీ పిలుపు, పలువురు అరెస్ట్, మైనంపల్లి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు

ఈ జిల్లా తెలంగాణ సాధ‌న‌లో తొలిసింహ గ‌ర్జ‌న నుంచి నేటి వ‌ర‌కు కూడా సెంటిమెంట్‌గా బ్ర‌హ్మాండ‌మైన పద్ధతుల్లో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విజ‌యం చేకూరే వేదిక‌గా ఈ జిల్లా మారింది. ఈ క్ర‌మంలోనే ఈ జిల్లా నుంచే అద్భుత‌మైన ఉద్య‌మానికి శ్రీకారం చుడుతున్నాను. మ‌హ‌నీయుడు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, బాబు జ‌గ్జీవ‌న్రామ్‌కు పుష్పాంజ‌లి ఘ‌టించి శ్రీకారం చుడుతున్నాం.’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ద‌ళితబంధు ఇది ఒక ప్ర‌భుత్వ కార్యక్రమం కాదు. కాకూడ‌దు కూడా. ఇది ఒక మ‌హా ఉద్య‌మం. ఈ ఉద్య‌మం క‌చ్చితంగా విజ‌యం సాధించి తీరుతుంది.

గ‌తంలో నేను తెలంగాణ ఉద్య‌మం ప్రారంభించిన‌ప్పుడు చాలా అనుమానాలు, అపోహాలు ఉండేవి. మీ అంద‌రి దీవ‌నెలతో రాష్ట్రం న‌లుమూలుల ఉద్య‌మం ఉవ్వెత్తున చెల‌రేగి 14, 15 సంవత్సారల కృషి త‌ర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ స‌గ‌ర్వంగా దీవిస్తున్నారు. అనేక రంగాల్లో అద్భుత‌మైన విజ‌యాలు సాధించాం. ప్ర‌తి రోజు ప్ర‌తి నిత్యం మీ కండ్లముందు గ్రామాల్లో, మండ‌లాల్లో, మీ అనుభ‌వంలో చాలా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

దళితబంధు విజయం సాధించి తీరుతుందని, దాన్ని మరింత విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, యువతదేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘దళిత బంధును విజ‌యం సాధించితీరుతది. నిన్న‌నే 75వ స్వాతంత్ర్య దినోత్స‌వం జ‌రుపుకున్నాం. ఈ 75 ఏండ్ల‌లో భార‌త‌దేశంలో ప్ర‌ధాని, పార్టీ కానీ ద‌ళిత కుటుంబాల‌ను ఆదుకోవాలే, ఇంటికి రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని ఎవ‌రైనా మాట్లాడారా? క‌నీసం వాళ్ల మైండ్‌కైనా వ‌చ్చిందా? ఆ దిశ‌గా ఆలోచ‌న చేశారా చేయ‌లేదు.

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదు, 2031 తర్వాతనే చేపడతామని తెలిపిన కేంద్రం, ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్

ఈ పథకం ఏడాది కిందనే మొద‌లుకావాలి. కానీ క‌రోనా వ‌ల్ల సంవ‌త్స‌రం ఆల‌స్య‌మైంది. ఐదు రూపాయాలు కూడా ఇవ్వ‌లేనోడు.. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ప‌క్క‌న బాంబులు ప‌డ్డ‌ట్టు భ‌య‌ప‌డుతున్నారు. ద‌ళితులు బాగుప‌డొద్దా. ఎవ‌రెవ‌రకి ఇస్తారో అని చెప్పాలంటున్నారు. కుండబ‌ద్ధలు కొట్టి చెబుతాం, అందరికీ ఇస్తాం. ద‌ళిత మేధావులు, ర‌చ‌యిత‌లు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువ‌త‌కు మ‌న‌వి చేస్తున్నా. ఈ ప‌థ‌కాన్ని విజ‌య‌వంతం చేసే బాధ్య‌త మీ మీద‌నే ఉంది’ అని సీఎం తెలిపారు. మొత్తం మంత్రివ‌ర్గం, పార్లమెంట్ స‌భ్యులు, శాస‌న‌స‌భ్యులు, ఎమ్మెల్సీలు వేదికపై ఉన్నారని, రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారుల త‌ర‌పున నూటికి నూరు శాతం విజ‌య‌వంతం చేస్తామ‌ని సీఎస్ సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

దళితబంధు వచ్చినా రేషన్‌, పెన్షన్లు కొనసాగుతోంది. వచ్చే నెల, రెండు నెలల్లో అందరికి దళితబంధు వస్తుంది. ప్రభుత్వ పథకాల్లో, కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు ఇస్తాం. నూటికి నూరుశాతం దళితబంధు అమలు చేస్తాం. దళితబంధును విజయవంతం చేసే బాధ్యత విద్యార్థులపై ఉంది. ఎస్సీల్లో పేదలకు ముందుగా దళితబంధు వర్తిస్తుంది.’ అని పేర్కొన్నారు. అనంతరం 15 మంది లబ్ధిదారులకు రూ. 10 లక్షల చొప్పున చెక్కులు అందించారు