Telangana CM KCR | File Photo

Hyderabad, Sep 13: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి టూర్ లో (CM KCR Yadadri Tour) భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ లక్ష్మీనరసింహ స్వామిని (Yadadri Lakshmi Narasimha Swamy Temple)దర్శించుకుని ప్రత్రేక పూజలు నిర్వహించారు. అర్చకులు ముఖ్యమంత్రికి తీర్థం అందజేశారు. అనంతరం కేసీఆర్ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు.

యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంది. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్.. యాదాద్రికి (Yadadri Temple) వెళ్లి స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆయన ఆదివారం యాదాద్రి పర్యటనకు వచ్చారు.2014లో ప్రారంభించిన యాదాద్రి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ప్రధానాలయంలో శిల్పి పనుల తుది మెరుగులు, శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులతో పాటు కొండపైన జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు.

Here's CM KCR Yadadri Tour Video

ఐదేళ్ల క్రితం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు ప్రారంభించిన నాటి నుంచి కేసీఆర్‌ యాదాద్రికి రావడం ఇది 13వ సారి. ప్రస్తుతం దేశంలోనే అద్భుత రాతి కట్టడంగా అపురూప శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.