CM Revanth Reddy Brother Tirupathi Reddy On Lagacherla Incident(video grab)

Hyd, Nov 13:  వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అధికారులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి.

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిశారు తిరుపతి రెడ్డి. అనంతరం మాట్లాడుతూ..రెండు రోజులుగా తాను లోకల్లో లేను.. ఫార్మా సిటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని తేల్చిచెప్పారు. లగిచర్ల గ్రామంలో అధికారులపై జరిగిన దాడి వెనక ఎవరన్నా వదిలిపెట్టేది లేదు అని స్పష్టం చేశారు.

సీఎం పేరు ప్రతిష్టలు దెబ్బతీసేందుకే హరీష్ రావు, కేటీఆర్ లు ఇలాంటివి చేపిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ శక్తులు పనిచేశాయి..నిందితులు ఎంతటి వారైనా సరే పోలీసులు అరెస్ట్ చేసి తీరుతారు అన్నారు.   ఏ1గా బోగమోని సురేష్, లగిచర్ల ఘటనపై పోలీసుల రిమాండ్ రిపోర్ట్, పథకం ప్రకారమే దాడి చేశారని వెల్లడి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, ఎంపీ డీకే అరుణను అడ్డుకున్న పోలీసులు 

Here's Video:

హరీష్ రావు లాగా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ కోసం రాత్రికి రాత్రే గ్రామాలను ఖాళీ చేపించి రైతులను మేము కొట్టట్లేదు...ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంటే అమాయకులను రెచ్చగొట్టారు అన్నారు. చట్టం తప్పకుండా తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు.

Here's Tweet:

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి pic.twitter.com/hn6bWMlBKK