Police Remand report on Kodangal Lagacherla Incident, BRS Leader Patnam Narender Reddy arrest

Hyd, Nov 13:  ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థులు దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కలెక్టర్, అధికారులపై దాడి వెనుక కుట్ర కోణం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఐజి నారాయణ‌ రెడ్డి.

బోగమోని సురేష్‌ అనే వ్యక్తి కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించారని తెలిపారు. అధికారులు, కలెక్టర్‌ను పక్కకు తీసుకెళ్లి ఉద్దేశపూర్వకం గానే గ్రామస్తులతో దాడి చేయించారని పేర్కొన్నారు. సురేష్‌ను బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తగా గుర్తించామని, అతడి స్వస్థలం హైదరాబాద్‌ లోని మణికొండ అని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా గ్రామానికి వెళ్లి అక్కడ సురేష్ గ్రామస్థులను రెచ్చ గొట్టినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని అన్నారు.

లగిచర్ల ఘటన నేపథ్యంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఉదయం కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

కలెక్టర్ పై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలను ప్రస్తావించారు పోలీసులు. సెక్షన్ 61(2) 191(4),132,109,121(1) 126(2)324 r/w190BNS Sec 30Of pdpp act, 128Of bnss కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వికారాబాద్ DSP శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు తో కేసు నమోదు చేశారు. మొత్తం 46మందిని నిందితులుగా చేర్చగా A1 గా బోగమోని సురేష్ ప్రధాన నిందితుడుగా పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు16మందిని అరెస్ట్ చేయగా 30 మంది పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.  బతుకమ్మ కుంట చెరువుకు పూర్వ వైభవం తెస్తాం, కుంట ప్రాంతంలో ఎలాంటి కూల్చివేతలు ఉండవన్న రంగనాథ్..ప్రజలు ఆందోళన చెందవద్దని వినతి 

Here's Tweet:

ఇక రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడిచేశారని...రాళ్లు, కర్రలు, కారంపొడి ముందే సిద్ధం చేసుకున్నారు అని పేర్కొన్నారు. అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశాడు A1 నిందితుడు సురేష్..ప్రధాన నిందితుడు సురేష్ పాటు 29 మంది పరారీలో ఉన్నారని తెలిపారు.

ఈ ఘటనలో ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు గాయాలయ్యాయి, ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారన్నారు. లగుచర్ల గ్రామానికి కావాలనే కలెక్టర్ ను సురేశ్ తీసుకెళ్లారని పేర్కొన్నారు. మరోవైపు లగచర్ల ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నెర్ర చేశారు. లగచర్ల ఘటనలో ఎవరిని వదలము-చేసినవాళ్లను ,చేయించినవాళ్ళను అందరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పట్నం నరేందర్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేయలేదు కిడ్నాప్ చేశారు. ఆయనేమైనా బందిపోటా? అని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. భూసేకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, పేద బీసీ ల భూములను రేవంత్ రెడ్డి తన అనుచరులు, కుటుంబ సభ్యులకు ఇచ్చి రియల్ ఎస్టేట్ దందా చేసే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇంటర్ నెట్ ను బంద్ పెట్టారు. అసలు ఇంటర్నెట్ బంద్ చేయటానికి వీలు లేదు అన్నారు. ఏ విధంగా పట్నం నరేందర్ రెడ్డి ని అరెస్ట్ చేస్తారు చెప్పాలన్నారు.

కొడంగల్ లో సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త 7 ఎకరాల భూమి పోతోంది. విలువైన భూమి పోతదంటే అడగటం తప్పా? చెప్పాలన్నారు. సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ అభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు రైతుల బాధలను ఆయనకు చెప్పాడు. ఎక్కడ కూడా దాడి చేయలేదు అన్నారు.సురేష్ దాడికి పాల్పడినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా?...సురేష్ అసలు దాడియే చేయలేదు. కడుపు మండి తన భూమి గురించి అడిగాడు అన్నారు. నీ ఆనాలోచిత విధానాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?...సురేష్ నాతో వచ్చి కలవటమే తప్పు అయితే రాహుల్ గాంధీ వ్యతిరేకించే అదానీతో రేవంత్ రెడ్డి రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. మరి దానికి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించాలి కదా? అన్నారు. రైతుల చేతికి బేడిలా?, కాంగ్రెస్ 11 నెలల పాలనలో తెలంగాణ చీకటి మయం అయిందన్న కేటీఆర్, అన్ని వర్గాల ప్రజలను వంచించిన కాంగ్రెస్ అని ఫైర్ 

Here's Video:

భూసేకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, పేద బీసీల భూములను రేవంత్ తన అనుచరులు, కుటుంబ సభ్యులకు ఇచ్చి రియల్ ఎస్టేట్ దందా చేసే కుట్ర చేస్తున్నాడు.

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని లగచర్ల గ్రామంలో జరిగిన ఘటన రైతుల ఆగ్రహాన్ని సూచిస్తోందన్నారు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం. రైతులు తమ భూములను కోల్పోవడానికి సిద్ధంగా లేరనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గమనించాలన్నారు. జిల్లా కలెక్టర్, అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ నిరసనలతో ప్రారంభమై ప్రతిఘటనకు దారితీసిందని...రైతులపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నరు అన్నారు.

బీజేపీ ఎంపీ డీకే అరుణ లగచర్లలో పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. మన్నెగూడ వద్ద ఎంపీ Dk. అరుణ వాహనాన్ని‌అడ్డుకున్నారు పోలీసులు. ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించొద్దా..?, ఏ తప్పు చేశామని అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు వెళ్తున్నాము...నా నియోజకవర్గం లో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో లా & ఆర్డర్ కంట్రోల్ చేసుకోలేక పోయారు ...సీఎం రేవంత్ రెడ్డి వల్ల లా & ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది..ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అరుణ.

Here's Video: