CM Revanth Reddy Challenges Harishrao,Telangana Third Phase Runa Mafi funds release

Khammam, Aug 15: రుణమాఫీ అమలు చేసి చూపించాం..బీఆర్ఎస్ నేత హరీష్‌ రావుకు సిగ్గుంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీనామా చేయకపోతే ఏటిలో దూకి చావాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలోని వైరాలో రైతులను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్..31 వేల కోట్లతో రుణమాఫీ పూర్తి చేశామన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే, హరీష్ రావు ఒకవేళ 2 లక్షల రుణమాఫీ అయితే రాజీనామా చేస్తానని అన్నారు. ఆ మాటను నిలబెట్టుకోవాలన్నారు. దేశ చరిత్రలో 25 రోజుల్లోనే రూ.31 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. హరీష్ రావు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి, తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని నిరూపించామన్నారు.

ఖమ్మం జిల్లా ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఎన్ని డబ్బులు అవసరమైతే అన్ని డబ్బులు కేటాయిస్తామన్నారు. ఎంతమంది అడ్డుపడ్డ రుణమాఫీ చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారఖునే జీతాలు ఇస్తున్నామన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని తెలిపారు రేవంత్. గొల్కోండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, పెద్దన్నగా చెబుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ 

32.50 లక్షల మంది బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. జులై 18న మొదటి విడ తగా లక్ష రూపాయల స్లాబ్ వరకు 11లక్షలా 14వేల 412 మంది రైతులకు 6వేల 34.97 కోట్లు విడుదల చేశామన్నారు. జులై 30న అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో లక్ష నుంచి లక్షా 50 వేల వరకు రుణాలున్న 6 లక్షలా 40వేల 823 మంది రైతుల ఖాతా ల్లో 6వేల190.01 కోట్లు జమ చేసింది. తాజాగా 17.55 లక్షల రైతుల కుటుంబాలకు 12 వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేసింది.