Hyd, Aug 24: తెలంగాణలో మరో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నారా?, కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు ఫలించాయా?, అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ఒప్పుకోవడంతో ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణం హీటెక్కింది.
వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే బీఆర్ఎస్‌ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే చేరికలకు మాత్రం బ్రేక్ పడింది. తాజాగా మరోసారి చేరికల అంశంపై సీఎం రేవంత్ దృష్టి సారించడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి హస్తాన్ని అందుకోగా మరో 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం కావడం ఖాయం.
ప్రధానంగా పార్టీ మారేందుకు రెడీగా ఉన్న ఎమ్మెల్యేల వివరాలకు వస్తే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. నెలకు ఒక్కసారైనా హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలో కలెక్టర్లు రాత్రి బస చేయాలి.. సీఎస్ కీలక ఆదేశాలు
అయితే వీరిలో మాణిక్‌రావు, విజేయుడు చేరికను స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తుండటంతో కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న సంపత్..అలంపూర్‌లో విజేయుడు చేరికను ఒప్పుకోవడం లేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎంటరై బుజ్జగిస్తే వీరంతా సైలెంట్ అయ్యే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ వర్గాల టాక్.
అయితే మరోవైపు ఫిరాయింపులపై న్యాయపోరాటానికి సిద్ధమైంది బీఆర్ఎస్. ప్రధానంగా దానం నాగేందర్ పై అనర్హత వేటు పడేలా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.మొత్తంగా మరోసారి ఎమ్మెల్యేల చేరిక అంశం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.