Hyd, Oct 6: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలవనున్నారు సీఎం. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ కానుండగా ఈ సమావేశానికి హాజరుకానున్నా రేవంత్ రెడ్డి.
వరద నష్టంపై మరోసారి వినతిపత్రం ఇవ్వనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు తీరని నష్టాలను మిగిల్చాయి. వరద నష్టాన్ని అంచనావేయడానికి రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోపాటు, కేంద్ర ప్రత్యేక బృందం పర్యటించింది. వరద నష్టం రూ.10 వేల కోట్లకు పైగా అంచనా వేయగా కేంద్రం కేవలం రూ.421 కోట్లు మాత్రమే కేంద్రం నిధులు విడుదల చేసింది.ఇకపై జిల్లాలకు హైడ్రా, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన..కాంగ్రెస్ నేతలు కబ్జా చేసిన వదలమని హెచ్చరిక
Here's Tweet:
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.....
రెండు రోజుల పాటు రేవంత్ ఢీల్లీ పర్యటన....
రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ....
హాజరు కానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి....
ఇటీవల వరద నష్టంపై మరోసారి వినతిపత్రం ఇవ్వనున్న రేవంత్....…
— Telangana Awaaz (@telanganaawaaz) October 6, 2024
ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ అగ్రనేతలను సైతం కలిసే అవకాశం ఉంది. హైడ్రాతో పాటు మంత్రి కొండా సురేఖ అంశాన్ని కాంగ్రెస్ పెద్దలకు వివరించనున్నారు. అలాగే దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మంగళవారం తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.