Hyd, July 20: నిరుద్యోగుల కోసమే గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేశామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ప్రజా భవన్‌లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి...త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు.
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేసిన రేవంత్...అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం అన్నారు. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్2 పరీక్ష వాయిదా వేశాం అని..ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమేనన్నారు.
యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశాం అని, పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, ప్రతీ ఏటా మార్చ్ లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటాం అన్నారు. జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. వాయుగుండంగా మారిన అల్పపీడనం, తడిసి ముద్దైన ఏపీ, తెలంగాణ...తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు, జురాలకు సందర్శకుల తాకిడి
అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ..ద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినట్టుగా త్వరలోనే విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహణ, పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలందరికీ యూనిఫాంలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు రేవంత్.