Hyderabad, JAN 25: పద్మ పురస్కారాల (Padma Awards 2025) విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) లేఖ రాయాలని యోచనలో సీఎం ఉన్నారు. గద్దర్ (Gaddar), చుక్కా రామయ్య (Chukka Ramaiah), అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు.
139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం తెలంగాణ కనీసం ఐదు పురస్కారాలు కూడా ప్రకటించకపోవడంపై రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.