Gandhi Junior Doctors Strike: సర్కారు చర్చలు విఫలం, సమ్మె దిశగా గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు, సమ్మెకు మద్దతు తెలిపిన బీజేపీ నేత రాంచంద్రరావు
Gandhi Junior Doctors Strike (Photo-Twitter)

Hyderabad, June 11: తెలంగాణ సర్కారుతో గాంధీ జూనియర్ డాక్టర్లు చేసిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె చేసేందుకే జూడాలు (Gandhi Junior Doctors Strike) నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (Telangana Junior Doctors Association ) ప్రకటించింది. గాంధీ ఆస్పత్రిలో (Hyderabad's Gandhi Hospital) కరోనా పేషెంట్ మరణానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ షెంట్ బంధువులు ఓ డాక్టరుపై దాడి చేశారు. తెలంగాణలో కొత్తగా మరో 191 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 4 వేలు దాటిన మొత్తం కరోనా బాధితుల సంఖ్య, 156కు పెరిగిన కోవిడ్ మరణాలు

దానికి నిరసనగా మంగళవారం రాత్రి నుంచే జూడాలు (Junior Doctors) ఆందోళన చేస్తున్నారు. బుధవారం గాంధీ ఆస్పత్రి ఎదుట మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. సేవ్ డాక్టర్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు.సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి రావాలని తమ డిమాండ్లను నెరవేర్చాలని పట్టుబట్టారు.

Here's  strike videos

ఈ నేపథ్యంలోనే చర్చల కోసం సెక్రటేరియట్ కు రావాల్సిందిగా జూడాలకు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాచారం ఇచ్చారు. అయితే, తాము రాబోమని జూడాలు తేల్చి చెప్పడంతో ఈటలనే గాంధీకి వెళ్లారు. గాంధీ మెడికల్ కాలేజీలోని సెమినార్లల్లో జూడాలతో మంత్రి ఈటల, పోలీస్ అధికారులు చర్చలు జరిపారు. గాంధీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలని జూడాలు డిమాండ్ చేశారు. డాక్టర్లు, ఇతర స్టాఫును రిక్రూట్ చేయాలని, సెక్యూరిటీ పెంచాలని, హెల్త్ మినిస్టర్ అడ్వైజరీ కమిటీలో చోటు కల్పించాలని కోరారు. ఎమర్జెన్సీ వార్డుల్లో ఎస్పీజీ ప్రొటెక్షన్ పెట్టాలని కోరారు.

Here's ANI Tweet

కరోనా పేషెంట్లు పెరుగుతుండటంతో తమపై పని ఒత్తిడి పెరుగుతోందని, వేరే ఆస్పత్రుల్లోనూ ట్రీట్మెంట్ చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇస్తున్న పీపీఈ కిట్లలో కొన్ని నాసిరకంగా ఉన్నాయని, నాణ్యమైన కిట్లు ఇవ్వాలని కోరారు. చర్చల తర్వాత మాట్లాడిన మంత్రి ఈటల డాక్టర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలు ఉంటే తనతో చెప్పాలని, రోడ్డెక్కొద్దని డాక్టర్లకు సూచించారు. వేరే ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్పై సీఎం కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వారానికోసారి జూడాలతో సమావేశం అవుతామని హామీ ఇచ్చారు. వెంటనే విధుల్లో చేరాలని జూడాలను కోరారు.

Here's Niloufer Hospital Jr Doctors Support

జూడాలతో చర్చలు సఫలమయ్యాయని మంత్రి ఈటల కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ, ప్రకటన వచ్చిన కాసేపటికే.. సమ్మె కొనసాగిస్తున్నట్టు జూడాలు ప్రకటించారు. మంత్రితో చేసిన చర్చలు ఫలించలేదని, తమ డిమాండ్లేవీ నెరవేరలేదని చెప్పారు. ఇదిలా ఉంటే ఎమర్జెన్సీ వార్డులోని డాక్టర్లపై దాడి చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారిని రిమాండుకు పంపించారు. సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ట్విట్లర్లో ఈ విషయం వెల్లడించారు.

నిందితులపై ఐపీసీలోని వివిధ సెక్షన్లు, ఎపిడెమిక్ డిసీజ్ యాక్టులోని సెక్షన్ 4, తెలంగాణ మెడికేర్ సర్వీస్ పర్సన్, మెడికేర్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్ యాక్ట్ 2008 కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. వైద్యులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రిలో పోలీస్ బందోబస్తును పెంచుతామన్నారు.

ఈటలతో చర్చలకు ముందు బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్రావు గాంధీ ఆస్పత్రికి వెళ్లి జూడాల సమ్మెకు మద్దతు తెలిపారు. వైద్యులపై దాడులను అరికట్టలేని సర్కార్ అసలు ఏం చేస్తుందని ప్రశ్నించారు. కరోనా కట్టడిలో విఫలమైందని విమర్శించారు.