Hyd, Nov 23: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 602 కొత్త కేసులు (TS Covid Report) నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,64,128 కేసులు (Coronavirus in Telangana) నమోదయ్యాయి. నిన్న కరోనా బారినపడి మరో ముగ్గురు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,433కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1015 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
వీటితో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,51,468 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,227 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి . ఆదివారం 24139 టెస్టులు చేయడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 51,58,474 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా మరియు రికవరీ రేటు 95.20 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో మరోసారి కరోనావైరస్ విరుచుకుపడే అవకాశం ఉందని, తెలంగాణలో కూడా రెండవ దశ ప్రమాదం (coronavirus second wave) ఉందని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ ఆదేశించారు. కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి (CM KCR) ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రజలు కూడా తగిన వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఢిల్లీ, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కొద్దిగా పెరుగుతున్నాయి. దీంతో పాటు కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. సెకండ్ వేవ్ వచ్చినా సరే తట్టుకునే విధంగా (Telangana fight coronavirus) తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉండాలి. దానికి తగిన ఏర్పాట్లు చేయాలి’అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరగకుండా, సెకండ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని వెల్లడించారు. ప్రజలు తగిన వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడమే అసలైన మందు అని సూచించారు.పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య 2.1 శాతం మాత్రమే ఉంది. రికవరీ రేటు 94.03 శాతం ఉంటున్నది.